Share News

Shubman Gill: తొలి టెస్ట్‌లో సత్తా చాటిన్ గిల్.. కోహ్లీ రికార్డు బద్దలు

ABN , Publish Date - Jun 21 , 2025 | 10:09 AM

ఇంగ్లండ్‌తో కఠిన పరిస్థితుల్లో ఎలా రాణిస్తారో అనే అనుమానాల మధ్య తొలి టెస్ట్ ఆడిన టీమిండియా కుర్రాళ్లు అదరగొట్టారు. ఇంగ్లండ్‌‌తో శుక్రవారం మొదలైన తొలి టెస్ట్ తొలి రోజు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించారు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే శుభ్‌మన్ గిల్ అదరగొట్టాడు.

Shubman Gill: తొలి టెస్ట్‌లో సత్తా చాటిన్ గిల్.. కోహ్లీ రికార్డు బద్దలు
Shubman Gill

ఇంగ్లండ్‌తో కఠిన పరిస్థితుల్లో ఎలా రాణిస్తారో అనే అనుమానాల మధ్య తొలి టెస్ట్ ఆడిన టీమిండియా కుర్రాళ్లు అదరగొట్టారు. ఇంగ్లండ్‌‌తో శుక్రవారం మొదలైన తొలి టెస్ట్ తొలి రోజు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించారు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే శుభ్‌మన్ గిల్ (Shubman Gill) అదరగొట్టాడు. అద్భుత శతకం సాధించి జట్టును ముందుండి నడిపించాడు. ఈ నేపథ్యంలో పలు కీలక రికార్డులను కూడా తన పేరిట లిఖించుకున్నాడు (IND vs ENG Test Series).


ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి రోజు శుభ్‌మన్ గిల్ అజేయంగా సెంచరీ చేశాడు. 127 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. గిల్ టెస్ట్ కెరీర్‌లో ఇది ఆరో సెంచరీ. అయితే ఆసియా వెలుపల గిల్ సెంచరీ చేయడం ఇదే మొదటి సారి. కెప్టెన్‌గా తొలి టెస్ట్‌లోనే సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన భారత కెప్టెన్‌గా గిల్ నిలిచాడు. గిల్ కేవలం 25 సంవత్సరాల 285 రోజుల వయసులో కెప్టెన్‌గా గిల్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలో గిల్.. విరాట్ కోహ్లీ (26 సంవత్సరాలు, 34 రోజులు) రికార్డును బద్దలు కొట్టాడు (Shubman Gill Records).


అలాగే విదేశాల్లో టెస్ట్ సెంచరీ చేసిన మూడో అతి పిన్న వయస్కుడైన భారత కెప్టెన్‌గా గిల్ నిలిచాడు. గిల్ కంటే ముందు సచిన్ టెండూల్కర్ (23 సంవత్సరాల 253 రోజులు), కపిల్ దేవ్ (24 సంవత్సరాల 64 రోజులు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. అలాగే గిల్ తాజా ఇన్నింగ్స్‌తో 2000 టెస్ట్ పరుగులను కూడా పూర్తి చేసుకున్నాడు.


ఇవి కూడా చదవండి:

బుమ్రాతో అలాంటి పని మాత్రం చేయించొద్దు.. టీమిండియాకు గంగూలీ సూచన

టీమిండియాకు కెప్టెన్సీ ఎంత పెద్ద బాధ్యతో గిల్‌‌కు ఇంకా తెలియదు: దినేశ్ కార్తిక్

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 21 , 2025 | 10:09 AM