Share News

Sachin Tendulkar: గిల్-పంత్ మైండ్‌గేమ్.. ఇదే కావాలంటున్న సచిన్!

ABN , Publish Date - Jun 21 , 2025 | 09:20 PM

యంగ్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్, పించ్ హిట్టర్ రిషబ్ పంత్ మీద ప్రశంసల జల్లులు కురిపించాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. వాళ్ల మైండ్‌గేమ్స్ గురించి అద్భుతంగా విశ్లేషణ చేశాడు క్రికెట్ గాడ్. ఇంతకీ సచిన్ ఏమన్నాడంటే..

Sachin Tendulkar: గిల్-పంత్ మైండ్‌గేమ్.. ఇదే కావాలంటున్న సచిన్!
Sachin Tendulkar

టీమిండియా నయా కెప్టెన్ శుబ్‌మన్ గిల్, కొత్త వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇద్దరూ శతకాల మోత మోగించారు. గిల్ 227 బంతుల్లో 19 ఫోర్లు, ఒక సిక్స్‌తో 147 పరుగులతో అదరగొట్టాడు. పంత్ 178 బంతుల్లో 12 బౌండరీలు, 6 సిక్సుల సాయంతో 134 పరుగులు చేసి స్టోక్స్ సేన బెండు తీశాడు. ఇద్దరూ నాలుగో వికెట్‌కు 209 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జోడించారు. సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రైక్ రొటేషన్ చేస్తూనే బిగ్ షాట్స్ కూడా బాదారు. ప్రత్యర్థి బౌలర్లతో మైండ్‌గేమ్స్ కూడా ఆడారు. దీనిపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తాజాగా స్పందించాడు. వాళ్లిద్దరి ఆటపై తనదైన స్టైల్‌లో విశ్లేషణ చేశాడు. ఇంతకీ సచిన్ ఏమన్నాడంటే..

gill-pant.jpg


కావాలనే చేశారు..

‘రిషబ్ పంత్ ఆడిన ప్యాడెల్ స్వీప్ అనుకోకుండా కొట్టింది కాదు. అది కావాలనే తెలివిగా బాదిన షాట్. బంతి మీదకు దూకడం, బాల్ తన జోన్‌లోకి వచ్చేలా చేయడం, లెగ్ స్లిప్ మీదుగా పూర్తి నియంత్రతో కొట్టడం అంతా చక్కటి ప్రణాళికతో కూడుకున్నది. బషీర్ స్పెల్‌లో మరో విషయాన్ని గమనించా. అతడికి హిందీ అర్థమవుతుంది కాబట్టి శుబ్‌మన్ గిల్-రిషబ్ పదే పదే అదే భాషలో కావాలని బిగ్గరగా మాట్లాడారు. అది మామూలు సంభాషణ కాదు. బౌలర్‌తో వాళ్లు మైండ్‌గేమ్స్ ఆడారు. అతడి రిథమ్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు స్కోరుబోర్డు మీద కనిపించకపోవచ్చు. కానీ ఆటలో ఇవే అత్యంత ప్రభావవంతమైన పాత్ర పోషిస్తాయి’ అని ట్విట్టర్‌లో పెట్టిన పోస్ట్‌లో సచిన్ రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్స్ పంత్-గిల్ నుంచి ఇదే కావాలని, ప్రత్యర్థులను వాళ్లు ఇలాగే భయపెట్టాలని కామెంట్స్ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

8 ఏళ్ల తర్వాత రీఎంట్రీ

41 పరుగుల గ్యాప్‌లో 7 వికెట్లు

సెంచరీ తర్వాత గాల్లో పల్టీలు

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 21 , 2025 | 09:22 PM