IND vs ENG: 8 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. డకౌటై పెవిలియన్‌కు.. ఈ బాధ ఎవరికీ రావొద్దు!
ABN , Publish Date - Jun 21 , 2025 | 07:43 PM
టీమిండియా వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ రీఎంట్రీలో విఫలమయ్యాడు. 8 ఏళ్ల తర్వాత వచ్చిన సువర్ణావకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

టీమిండియాలో ఆడే అవకాశం దొరకడం అంటే మాటలు కాదు. కొత్త కుర్రాళ్లకు అయినా కాస్త త్వరగా అరంగేట్రం చేసే చాన్స్ రావొచ్చు. కానీ ఒక్కసారి జట్టుకు ఆడి చోటు కోల్పోతే తిరిగి ఆడే అవకాశం దొరకడం మాత్రం చాలా కష్టం. ఒకవేళ రీఎంట్రీ చాన్స్ వస్తే మాత్రం ప్లేయర్లు తమ టాలెంట్ నిరూపించుకోవాలి. అదరగొట్టి జట్టులో చోటు ఖాయం చేసుకోవాలి లేకపోతే మళ్లీ కమ్‌బ్యాక్ ఇవ్వడం గగనమే. ఇప్పుడు వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ పరిస్థితి అలాగే ఉంది. అప్పుడెప్పుడో ట్రిపుల్ సెంచరీ కొట్టాక కనుమరుగైన స్టైలిష్ బ్యాటర్.. 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. కానీ ఏం లాభం.. 5 బంతులకే డకౌట్ అయి పెవిలియన్‌కు చేరాడు.
ఐదో బంతికే..
ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన కరుణ్ నాయర్.. దేశవాళీల్లోలాగే అంతర్జాతీయ మ్యాచుల్లోనూ ఇరగదీస్తాడని అంతా అనుకున్నారు. అప్పటికే యశస్వి జైస్వాల్ (101), కేఎల్ రాహుల్ (42), శుబ్‌మన్ గిల్ (147), రిషబ్ పంత్ (134) విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడటంతో నాయర్ 40 నుంచి 50 పరుగులు చేసినా చాలని అభిమానులు అనుకున్నారు. పెద్దగా ఒత్తిడి లేదు కాబట్టి వేగంగా పరుగులు చేస్తే బాగుంటుందని భావించారు. కానీ నాయర్ ఒక్క పరుగు కూడా చేయకుండానే క్రీజును వీడాడు. ఎదుర్కొన్న ఐదో బంతికే బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో ఓలీ పోప్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఈ బాధ ఎవరికీ రాకూడదని అభిమానులు వాపోతున్నారు.
ఇలా అయిందేంటి..
ఇన్నాళ్లకు రీఎంట్రీ ఇస్తే ఇలా అయిందేంటని ఫ్యాన్స్ బాధపడుతున్నారు. కరుణ్ నాయర్‌కు ఈ సిరీస్‌లో మరిన్ని అవకాశాలు రావొచ్చు. సీనియర్లు లేనందున టీమ్ మేనేజ్‌మెంట్ మరిన్ని చాన్సులు ఇచ్చి ప్రోత్సహించొచ్చు. కానీ ఇదే రిజల్ట్ మళ్లీ రిపీటైతే మాత్రం అతడ్ని పక్కనబెట్టే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి జట్టులో కుదురుకోవాలంటే అతడు మరింత జాగ్రత్తగా, ఏకాగ్రతతో ఆడుతూ ప్రతి చాన్స్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని నెటిజన్స్ సూచిస్తున్నారు. జట్టును గెలిపించడంతో పాటు తన టాలెంట్‌ను నిరూపించుకోవడం మీద దృష్టి పెట్టాలని అంటున్నారు.
ఇవీ చదవండి:
41 పరుగుల గ్యాప్‌లో 7 వికెట్లు
ఈ ఇన్నింగ్స్ శానా ఏండ్లు యాదుంటది!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి