Share News

Rishabh Pant Century: పంత్ స్పెషల్ నాక్.. ఇది శానా ఏండ్లు యాదుంటది!

ABN , Publish Date - Jun 21 , 2025 | 05:02 PM

టీమిండియా డాషింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ సంచలన ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న లీడ్స్ టెస్ట్‌లో అతడు ధనాదన్ బ్యాటింగ్‌తో అలరించాడు.

Rishabh Pant Century: పంత్ స్పెషల్ నాక్.. ఇది శానా ఏండ్లు యాదుంటది!
Rishabh Pant

లీడ్స్ టెస్ట్‌లో భారత బ్యాటర్లు చెలరేగుతున్నారు. ఇప్పటికే యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (147 నాటౌట్) సెంచరీలతో వీరవిహారం చేయగా.. తాజాగా రిషబ్ పంత్ (113 నాటౌట్) శతకం బాదాడు. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్ టీమిండియా నుంచి మూడు సెంచరీలో నమోదయ్యాయి. 153 బంతుల్లోనే మూడంకెల మార్క్‌ను అందుకున్నాడు పంత్. ఇందులో 10 బౌండరీలు, 5 భారీ సిక్సులు ఉన్నాయి. రెండో రోజు ఆట మొదలైనప్పటి నుంచి వేగంగా పరుగులు చేయాలనే కనితో కనిపించాడు రిషబ్. ఫోర్లు, సిక్సులు బాదుతూనే వికెట్ల నడుమ కూడా స్పీడ్‌గా పరుగులు తీశాడు. సింగిల్స్‌ను డబుల్స్‌గా మలుచుతూ ఇంగ్లండ్ ఫీల్డర్లను ఇబ్బంది పెట్టాడు.

pant-century.jpg


ఢోకా లేదు..

పంత్ టెస్ట్ కెరీర్‌లో ఇది 7వ సెంచరీ కావడం గమనార్హం. టీమిండియా వైస్ కెప్టెన్‌గా పగ్గాలు అందుకున్నాక తొలి టెస్ట్‌లోనే సెంచరీ బాదడం మరో విశేషం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాలు జట్టుకు దూరమైన తరుణంలో పంత్ సెంచరీతో టీమ్‌కు తాను ఉన్నానంటూ భరోసా ఇవ్వడం శుభపరిణామమనే చెప్పాలి. అందుకే ఈ నాక్ శానా ఏండ్లు యాదుంటదని అభిమానులు అంటున్నారు. కాగా, ఇటు పంత్‌తో పాటు కెప్టెన్ గిల్, ఓపెనర్ జైస్వాల్, సీనియర్ బ్యాటర్ రాహుల్ కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో టీమిండియా ఫ్యూచర్‌కు ఢోకా లేదనే వ్యాఖ్యలు వినిపస్తున్నాయి.

pant-somersalut.jpg


ఆ మార్క్ దాటాల్సిందే..

తొలి టెస్ట్‌లో భారత్ పటిష్ట స్థితికి చేరుకుంది. ప్రస్తుతం 104 ఓవర్లలో 4 వికెట్లకు 446 పరుగులతో ఉంది టీమిండియా. పంత్‌తో పాటు కరుణ్ నాయర్ (0) ఇప్పుడు క్రీజులో ఉన్నారు. భారత్ 550 పరుగుల మార్క్‌ను చేరుకుంటే ఆతిథ్య జట్టును మరింత ఇబ్బందుల్లోకి నెట్టడం ఖాయం. పంత్‌, నాయర్‌తో పాటు రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ రూపంలో మంచి బ్యాటర్లు అందుబాటులో ఉన్నందున 550 పరుగులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఇవీ చదవండి:

గిల్‌కు పంత్ వార్నింగ్!

టీమిండియాలో టెన్షన్! కారణం ఇదే..

జెమీమాను రిటైన్‌ చేసుకున్న బ్రిస్బేన్‌

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 21 , 2025 | 05:20 PM