Rishabh Pant: పంత్ క్రేజీ రికార్డ్.. రోహిత్-కోహ్లీని మించిపోయాడు!
ABN , Publish Date - Jun 21 , 2025 | 04:39 PM
టీమిండియా పించ్ హిట్టర్ రిషబ్ పంత్ క్రేజీ రికార్డు నెలకొల్పాడు. దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని స్పైడీ దాటేశాడు. మరి.. అతడు అందుకున్న ఘనత ఏంటో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా డాషింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ అరుదైన ఘనత అందుకున్నాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో అతడు బౌండరీలు, సిక్సులతో రెచ్చిపోతున్నాడు. ఇదే క్రమంలో ఓ క్రేజీ రికార్డు సృష్టించాడు పంత్. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ చరత్రలో అత్యధిక సిక్సులు బాదిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. లెజెండరీ బ్యాటర్ రోహిత్ శర్మ (56 సిక్సులు)ను పంత్ (58 సిక్సులు) దాటేశాడు. డబ్ల్యూటీసీ హిస్టరీలో అత్యధిక సిక్సులు బాదిన వారి జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు పంత్.
చెరిపేయడం ఖాయం..
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో అత్యధిక సిక్సులు బాదిన బ్యాటర్‌గా ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ (83 సిక్సులు) ఉన్నాడు. అతడు 54 మ్యాచుల్లో 83 సిక్సులతో టాప్‌లో కొనసాగుతున్నాడు. అతడి తర్వాతి స్థానంలో పంత్ (35 మ్యాచుల్లో 58 సిక్సులు) ఉన్నాడు. మూడో స్థానంలో రోహిత్ (40 మ్యాచుల్లో 56 సిక్సులు), నాలుగో స్థానంలో యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (20 మ్యాచుల్లో 40 సిక్సులు) ఉన్నారు. పంత్ ఇదే రీతిలో అదరగొడితే స్టోక్స్ రికార్డును అతి త్వరలో చెరిపేయడం ఖాయంగా కనిపిస్తోంది.
పాత రికార్డులకు పాతర..
లీడ్స్ టెస్ట్‌లో పంత్ మరో రికార్డు కూడా సృష్టించాడు. సేనా (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా వికెట్ కీపర్-బ్యాటర్‌గా పంత్ (27 మ్యాచుల్లో 1731 పరుగులు) నిలిచాడు. తద్వారా ధోని (32 మ్యాచుల్లో 1731 పరుగులు)ను అతడు దాటేశాడు. టెస్టుల్లో 3 వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు రిషబ్. ఈ మైల్‌స్టోన్‌ను అందుకునేందుకు అతడికి 76 ఇన్నింగ్స్‌లు పట్టింది. తద్వారా కంగారూ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ (63 ఇన్నింగ్స్‌లు) తర్వాత అత్యంత వేగంగా 3 వేల పరుగులు బాదిన వికెట్ కీపర్‌గా అతడు నిలిచాడు. కాగా, లీడ్స్ టెస్ట్‌లో భారత్ ప్రస్తుతం 3 వికెట్లకు 397 పరుగులతో పటిష్ట స్థితిలో ఉంది. 500 పరుగుల మార్క్‌ను అందుకోవడమే లక్ష్యంగా గిల్ (139 నాటౌట్), పంత్ (88 నాటౌట్) బ్యాటింగ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
టీమిండియాలో టెన్షన్! కారణం ఇదే..
జెమీమాను రిటైన్ చేసుకున్న బ్రిస్బేన్
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి