Share News

Rishabh Pant Celebration: సెంచరీ తర్వాత గాల్లో పల్టీలు.. ఈ సెలబ్రేషన్‌కు అర్థం తెలుసా?

ABN , Publish Date - Jun 21 , 2025 | 06:03 PM

టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇంగ్లండ్‌ బౌలర్లకు అతడు విశ్వరూపం చూపించాడు. సూపర్ సెంచరీతో ప్రత్యర్థులను వణికించాడు.

Rishabh Pant Celebration: సెంచరీ తర్వాత గాల్లో పల్టీలు.. ఈ సెలబ్రేషన్‌కు అర్థం తెలుసా?
Rishabh Pant

క్రికెట్‌లో ఒక్కో ఆటగాడు ఒక్కోలా సెలబ్రేట్ చేసుకుంటాడు. వికెట్లు తీసినప్పుడు, క్యాచ్ అందుకున్నప్పుడు లేదా సెంచరీ బాదినప్పుడు తమదైన స్టైల్‌లో సెలబ్రేట్ చేసుకుంటారు. కొందరు తొడగొట్టి, మరికొందరు మీసం తిప్పి, ఇంకొందరు గాల్లో పంచులు ఇస్తూ.. ఇలా రకరకాలుగా ఆ మూమెంట్‌ను ఆస్వాదిస్తుంటారు. అయితే టీమిండియా డాషింగ్ బ్యాటర్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ మాత్రం బ్యాటింగ్‌లోనే కాదు.. సెలబ్రేషన్స్‌లోనూ అందరికంటే తాను వైవిధ్యమని చాటుకుంటున్నాడు. గాల్లో పల్టీలు కొడుతూ అతడు సెలబ్రేట్ చేసుకునే తీరు అభిమానులను తెగ అలరిస్తోంది. దీని గురించి ఇప్పుడు చూద్దాం..

Rishabh-Pant-Celebrations.jpg-1.jpg


పల్టీలు కొడుతూ..

లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో సెంచరీతో చెలరేగాడు రిషబ్ పంత్. మొత్తంగా 178 బంతుల్లో 12 బౌండరీలు, 6 సిక్సుల సాయంతో 134 పరుగుల విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. ఎడాపెడా ఫోర్లు, సిక్సులు బాదుతూ టెస్టులను టీ20లుగా మార్చేశాడు. వికెట్‌కు నలువైపులా షాట్లు బాదిన పించ్ హిట్టర్.. స్కూప్ షాట్లతో భారీగా పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో సెంచరీ పూర్తైన తర్వాత గాల్లో పల్టీలు కొడుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇటీవల ఐపీఎల్-2025 టైమ్‌లోనూ ఇలాగే సెంచరీ కొట్టాక గాల్లో పల్టీలు కొడుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సెలబ్రేషన్‌ను సోమర్సాల్ట్ సెలబ్రేషన్ అని అంటారు. ఇది ఫుట్‌బాల్‌లో ఎక్కువగా కనిపిస్తుంది.


సిగ్నేచర్ సెలబ్రేషన్..

సోమర్సాల్ట్ సెలబ్రేషన్‌లో భాగంగా ఎక్కువ మంది అథ్లెట్లు బ్యాక్ ఫ్లిప్ చేస్తుంటారు. పెర్రీ ఎమరిక్, ఒబఫేమి మార్టిన్స్ లాంటి కొందరు ఆటగాళ్లు దీన్ని సిగ్నేచర్ సెలబ్రేషన్‌గా మార్చేశారు. రెండు చేతులను నేలపై ఉంచి కాళ్లను గాల్లోకి లేపి ముందు వైపు జంప్ చేస్తుంటారు. ఆ తర్వాత కాళ్లను గాల్లోకి లేపి మరోమారు ముందు వైపు ఎగురుతారు. అయితే పంత్ మాత్రం ఎక్కువగా ఫ్రంట్ ఫ్లిప్ వేస్తుంటాడు. రెండు చేతులతో అభిమానులకు అభివాదం చేసి ముందు వైపు పల్టీ కొడతాడు. అయితే ఈ సెలబ్రేషన్స్ చేయడం అంత ఈజీ కాదు. ఫుల్ ఫిట్‌గా ఉన్న కొందరు ప్లేయర్లు మాత్రమే ఇది చేస్తుంటారు. చాలా మంది ఆటగాళ్లు దీని జోలికి వెళ్లరు. ఈ స్టంట్ వేసే సమయంలో ఏ కాస్త తేడా వచ్చినా గాయాలపాలయ్యే ప్రమాదం ఉండటమే దీనికి కారణం.


ఇవీ చదవండి:

ఈ ఇన్నింగ్స్ శానా ఏండ్లు యాదుంటది!

టీమిండియాలో టెన్షన్! కారణం ఇదే..

జెమీమాను రిటైన్‌ చేసుకున్న బ్రిస్బేన్‌

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 21 , 2025 | 06:08 PM