Woman Viral Video: గాలిలో విహరిస్తున్న యువతి.. సడన్‌గా షాకింగ్ సీన్.. చివరకు చూస్తే..
ABN , Publish Date - May 04 , 2025 | 04:24 PM
ఓ యువతి హెలీకాప్టర్‌కు కట్టిన తాడుకు వేలాడుతూ గాలిలో విహరిస్తుంటుంది. మబ్బుల మధ్యలో రయ్యిన దూసుకెళ్తుంటుంది. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది.

కొందరికి సాహసాలు చేయడం అలవాటు. మరికొందరు ప్రమాదకర సహాసాలను సైతం ఎంతో అవలీలగా చేసేస్తుంటారు. ఇంకొందరు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి మరీ అనితరసాధ్యమైన సాహసాలను ఎంచుకుంటుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆకాశంలో తాడుకు వేలాడుతున్న యువతి.. ఉన్నట్టుండి ధబేల్‌మని కిందపడిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) వైరల్ అవుతోంది. ఓ యువతి హెలీకాప్టర్‌కు కట్టిన తాడుకు (young woman hanging from helicopter) వేలాడుతూ గాలిలో విహరిస్తుంటుంది. మబ్బుల మధ్యలో రయ్యిన దూసుకెళ్తుంటుంది. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది.
తాను వేలాడుతున్న తాడు తెగిందా, లేక ఆమే దాన్ని లాక్ ఊడదీసిందా తెలీదు గానీ.. ఒక్కసారిగా ఆమె గాలిలో నుంచి కిందపడిపోతుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. అయితే ఆ తర్వాత ఆ యువతి ప్యారాచూట్ తెరుచుకుందా, లేక ప్రమాదంలో చిక్కుకుందా అనే విషయం తెలియరాలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Jugaad Viral Video: వాష్ బేసినా.. పెట్రోల్ బంకా.. ఇతడి తెలివి మామూలుగా లేదుగా..
ఈ వీడియో నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో పాపం.. ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘ఆమెకు ఏమీ కాలేదు.. ఆమే స్వయంగా చేత్తో లాక్ తీసి కిందపడింది.. ఆ తర్వాత పారాచ్యూట్ సాయంతో కిందకు దిగింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 47 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Snake Viral Video: పాము ముందు నాగిని పాట.. సడన్‌గా ఎవరూ ఊహించని షాకింగ్ ట్విస్ట్..
ఇవి కూడా చదవండి..
Woman Funny Video: కాళ్లను ఇలా ఎవరైనా కడుగుతారా.. ఈ యువతికి చివరికి ఏమైందో చూస్తే..
Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..
Stunts Viral Video: చావు అంచుల దాకా వెళ్లడమంటే ఇదే.. వ్యూస్ కోసం వీళ్ల నిర్వాకం చూస్తే..