Share News

Jugaad Viral Video: వాష్ బేసినా.. పెట్రోల్ బంకా.. ఇతడి తెలివి మామూలుగా లేదుగా..

ABN , Publish Date - May 03 , 2025 | 08:30 PM

ఓ వ్యక్తి తన బాత్రూంలో వాష్ బేసిన్‌ను తీరు చూసి అంతా అవాక్కవుతున్నారు. సాధారణంగా వాష్ బేసిన్‌పై ఉన్న కొళాయిని తిప్పితే నీరు వస్తాయి. లేదా కొళాయి సెన్సార్‌కు చేయి చూపించినా నీరు వచ్చేలా ఏర్పాట్లు చేస్తారు. అయితే ఇతను చేసిన ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు..

Jugaad Viral Video: వాష్ బేసినా.. పెట్రోల్ బంకా.. ఇతడి తెలివి మామూలుగా లేదుగా..

ఇంట్లో చిత్రవిచిత్ర పద్ధతిలో ఏర్పాట్లు చేసే వారిని తరచూ చూస్తుంటాం. బైకు హ్యాండిల్‌ సాయంతో బాత్రూం కమోడ్‌లోకి నీరు వచ్చేలా చేయడం, వాటర్ స్పింకర్లతో ఇంటిపై కూలింగ్ ఏర్పాట్లు చేయడం తదితర అనేక రకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన ఇంట్లో వాష్ బేసిన్‌ను నిర్మించిన తీరు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వాష్ బేసిన్‌లోకి దూకుతున్న పెట్రోల్.. ఐడియా మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన బాత్రూంలో వాష్ బేసిన్‌ను (Wash basin in the bathroom) తీరు చూసి అంతా అవాక్కవుతున్నారు. సాధారణంగా వాష్ బేసిన్‌పై ఉన్న కొళాయిని తిప్పితే నీరు వస్తాయి. లేదా కొళాయి సెన్సార్‌కు చేయి చూపించినా నీరు వచ్చేలా ఏర్పాట్లు చేస్తారు.

Cat Funny Video: కాలు కుంటుతున్న పిల్లి.. అయ్యో పాపం అన్న జనం.. అంతలోనే..


అయితే ఇతను చేసిన ఏర్పాట్లు చూసి అంతా ఖంగుతింటున్నారు. వాష్ బేసిన్ ‌పైన పెట్రోల్ పంపు (Petrol pump) తరహాలో హ్యాండిల్‌ను ఏర్పాటు చేశాడు. బేసిన్‌కు ఇటు వైపు కారు గేర్ (Car gear) తరహాలో మరో హ్యాండిల్ ఏర్పాటు చేశాడు. గేర్‌ను మార్చిన తరహాలో ఈ హ్యండిల్‌ను వెనక్కు లాగగానే.. పెట్రోల్ పంపు నుంచి నీళ్లు వస్తున్నాయి. ఇలా కారు గేరును, పెట్రోల్ పంపును వాష్ బేషిన్‌కు అమర్చాలనే ఇతడి ఆలోచన అందరికీ నవ్వు తెప్పిస్తోంది.

Nest Viral Video: ఈ పక్షులు చాలా రిచ్.. గూడును ఎలా నిర్మించాయో చూస్తే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతను కారు మెకానిక్‌తో పాటూ పెట్రోల్ బంకులో కూడా పని చేసినట్లున్నాడు’’.. అంటూ కొందరు, ‘‘ ఇతడి తెలివితేటలు మామూలుగా లేవుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 90కి పైగా లైక్‌లు , 11 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Snake Viral Video: పాము ముందు నాగిని పాట.. సడన్‌గా ఎవరూ ఊహించని షాకింగ్ ట్విస్ట్..


ఇవి కూడా చదవండి..

Woman Funny Video: కాళ్లను ఇలా ఎవరైనా కడుగుతారా.. ఈ యువతికి చివరికి ఏమైందో చూస్తే..

Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Stunts Viral Video: చావు అంచుల దాకా వెళ్లడమంటే ఇదే.. వ్యూస్ కోసం వీళ్ల నిర్వాకం చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 03 , 2025 | 08:30 PM