Share News

Viral Video: ఈ బైక్‌కు చలాన్ వేయడం అంత ఈజీ కాదు.. ఇతడి తెలివితేటలు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..

ABN , Publish Date - Jan 19 , 2025 | 04:05 PM

ప్రస్తుతం చాలా మంది యువకులు ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడం, బైకుపై వెళ్తున్న సమయంలో అడ్డదిడ్డంగా ప్రయాణించడం చేస్తుంటారు. ఇలాంటి సమయాల్లో పోలీసులు వారి నంబర్ ప్లేట్ ఆధారంగా చలాన్ విధిస్తుంటారు. అయితే..

Viral Video: ఈ బైక్‌కు చలాన్ వేయడం అంత ఈజీ కాదు..  ఇతడి తెలివితేటలు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..
glass putting on bike number plate

కొందరి తెలివితేటలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొందరి తెలివితేటలు చూస్తే అనితర సాధ్యం అనిపిస్తుంటుంది. అలాగే ఇంకొందరు అతి తెలివితో చేసే పిచ్చి పిచ్చి పనులు చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. కొందరు యువకులు పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు తమ వాహనాల నంబర్‌ ప్లేట్లపై ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు చలాన్ నుంచి తప్పించుకోవడానికి తన బైక్ నంబర్ ప్లేట్‌పై వినూత్న ప్రయోగం చేశాడు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ఈ బైక్‌కు చలాన్ వేయడం అంత ఈజీ కాదు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం చాలా మంది యువకులు ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడం, బైకుపై వెళ్తున్న సమయంలో అడ్డదిడ్డంగా ప్రయాణించడం చేస్తుంటారు. ఇలాంటి సమయాల్లో పోలీసులు వారి నంబర్ ప్లేట్ (Bike number plate) ఆధారంగా చలాన్ (Challan) విధిస్తుంటారు. అయితే దీన్నుంచి తప్పించుకోవడానికి కూడా కొందరు అతి తెలివిగా ఆలోచిస్తుంటారు.

Viral Video: అప్‌డేట్ అవ్వడమంటే ఇదేనేమో.. పాత బైకును ఇతనెలా మార్చాడో చూస్తే..


తాజాగా, ఓ వ్యక్తి తన బైక్‌కు ఇలాగే చేశాడు. బైక్ నంబర్ ప్లేట్‌పై పెయింట్ వేయడం గానీ, నంబర్లలో ఒకదాన్ని చెరిపేయడం గానీ, అడ్డుగా ఏదైనా వస్తువును వేలాడదీయడం గానీ చేయలేదు. సింపుల్‌గా ఆ నంబర్ ప్లేటు‌పై (glass fitting on number plate) ఓ గ్లాస్ ప్లేటును అతికించాడు. ఇలా చేయడం వల్ల దూరం నుంచి చూస్తే మెరుస్తూ ఉంటుందని, తద్వారా నంబర్ సరిగ్గా కనిపించదనేది అతడి ఉద్దేశం. కెమెరాకు కూడా నంబర్లు సరిగ్గా కనించవని చెబుతున్నాడు. ఇతడి అతి తెలివితేటలు చూసి అంతా అవాక్కవుతున్నారు.

Viral Video: పట్టుదల అంటే ఇదీ.. చేతులు లేకపోయినా ఎలా కష్టపడుతున్నాడో చూస్తే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘పోలీసులకు నేరుగా దొరికితే ప్లేటు పీకి పడేస్తారు జాగ్రత్త’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9వేలకు పైగా లైక్‌లు, 2.46 లక్షలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 19 , 2025 | 04:05 PM