Share News

Viral Video: రైల్వే గేటు వద్ద వేచి ఉన్న బైకర్.. ట్రైన్ కంటే ముందే దూసుకొచ్చిన ప్రమాదం.. చూస్తే నవ్వు ఆపుకోలేరు..

ABN , Publish Date - Jan 18 , 2025 | 04:19 PM

బైకులో వెళ్తున్న ఇద్దరు యువకులు.. రైల్వే గేటు (Railway gate) వద్ద బండి ఆపుకొని వేచి చూస్తున్నారు. ఓ వ్యక్తి బైకుపై ఉండగా.. మరో వ్యక్తి కింద నిలబడి రైలు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. అయితే ఇంతలో ఎవరూ ఊహించని విధంగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా ..

Viral Video: రైల్వే గేటు వద్ద వేచి ఉన్న బైకర్.. ట్రైన్ కంటే ముందే దూసుకొచ్చిన ప్రమాదం.. చూస్తే నవ్వు ఆపుకోలేరు..

రైల్వే గేటు వద్ద చోటుచేసుకునే ఊహించని ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. కొందరు గేటు ఎత్తకముందే పట్టాలు దాటేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కోల్పోతుంటే.. మరికొందరు చావు అంచుల దాకా వెళ్లి వస్తుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు తమాషా సంఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి రైల్వే గేటు వద్ద బైకు ఆపుకొని ఉంటాడు. అయితే రైలు రాకముందే అతడి వెనుక వైపు నుంచి ఊహించని ప్రమాదం దూసుకొచ్చింది. ఈ వీడియో చూసిన వారంతా ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. బైకులో వెళ్తున్న ఇద్దరు యువకులు.. రైల్వే గేటు (Railway gate) వద్ద బండి ఆపుకొని వేచి చూస్తున్నారు. ఓ వ్యక్తి బైకుపై ఉండగా.. మరో వ్యక్తి కింద నిలబడి రైలు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. అయితే ఇంతలో ఎవరూ ఊహించని విధంగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా ఆ సమయంలో రైలుపైనే అందరి చూపూ ఉంటుంది. వీళ్లు కూడా రైలు పట్టాల వైపే చూస్తూ వారి వెనుక గమనించుకోలేదు.

Viral Video: సీటు కోసం మహిళల కుస్తీ.. మధ్యలోకి దూరిన టీసీ.. చివరకు..


కానీ ఇక్కడ మాత్రం వీరికి వెనుక నుంచి ఊహించని ప్రమాదం దూసుకొచ్చింది. వెనుక వైపు దూరంగా ఓ గుర్రపు బండి దూసుకురావడాన్ని గమనించిన ఓ వ్యక్తి.. బైకుపై ఉన్న వ్యక్తిని అలెర్ట్ చేస్తాడు. దీంతో అతను వెనక్కు చూసి వెంటనే కిందకు దిగి బండిని పక్కకు లాక్కుంటాడు. వేగంగా దూసుకొచ్చిన గుర్రపు బండి అంతే (horse drawn carriage ran over railway tracks) వేగంగా రైలు గేటు కింద నుంచి దూసుకెళ్లిపోతుంది. అయితే ఆ సమయంలో రైలు రాకపోవడంతో గుర్రం క్షేమంగా అవతలి వైపునకు చేరుకుంటుంది.

Viral Video: 13వ అంతస్తు నుంచి దూకేసిన వ్యక్తి.. వలలో నుంచి బయటికి వచ్చి మరీ.. చివరకు..


ఈ ఘటనలో ఎవరకీ ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘రైలు రాలేదు కానీ.. గుర్రపు బండి వచ్చింది’’.. అంటూ కొందరు, ‘‘వందేభారత్ రైలు నిర్ణీత సమయానికే వచ్చేసింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా లైక్‌లు, 12.9 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఊపిరి బిగపట్టి చూడాల్సిన వీడియో.. కొండపైకి ఎక్కతుండగా జారిపోయిన మహిళ.. చివరకు జరిగింది చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 18 , 2025 | 04:19 PM