Viral Video: రైల్వే ట్రాక్స్‌ను అడ్డదిడ్డంగా దాటకూడదనేది ఇందుకే.. ఇతడికేమైందో మీరే చూడండి..
ABN , Publish Date - Jan 17 , 2025 | 03:20 PM
రైల్వే ట్రాక్స్‌ను అడ్డదిడ్డంగా దాటడం ప్రమాదమని తెలిసినా.. తెలిసి తెలిసి తప్పులు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు ఏకంగా ప్రాణాలు కూడా పొగొట్టుకోవడం చూస్తున్నాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది.. రైల్వే గేటు దాటుతుండగా.. ఇతడికి ఏమైందో చూడండి..

ప్రమాదమని తెలిసినా చాలా మంది తెలిసి తెలిసి తప్పులు చేస్తూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. రైలు పట్టాలు దాటే సమయంలో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండడం చూస్తూనే ఉన్నాం. చాలా మంది రైల్వే ట్రాక్స్‌ను దాటే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు ఉన్నా కూడా వినియోగించుకోకుండా అడ్డదిడ్డంగా పట్టాలను దాటేస్తుంటారు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ఊహించని ప్రమదాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి రైల్వే ట్రాక్స్‌ను దాటుతుండగా.. ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రైలు దిగిన చాలా మంది ప్రయాణికులు అవతలి వైపునకు వెళ్లే క్రమంలో రైల్వే ట్రాక్స్‌ను అడ్డదిడ్డంగా దాటుతూ వెళ్లారు. ఈ క్రమంలో ఓ వ్యక్తికి షాకింగ్ అనుభం ఎదురైంది. రైల్వే ట్రాక్స్ చివరలో ఏర్పాటు చేసిన ఇనుప కంచెను దాటుతుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రైలు పట్టాలు దాటిన ఆ వ్యక్తి.. చివరలో ఉన్న ఇనుప గేటును ఎక్కి దిగాల్సి వచ్చింది.
Viral Video: అరే..! ఇదేం మాయ.. ఇవి నీళ్లా లేక నిప్పు రవ్వలా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
ఇనుప గేటు ఎత్తు తక్కువగా ఉండడంతో అందరితో పాటూ ఇతను కూడా ఈజీగా దానిపైకి ఎక్కేశాడు. అయితే అవతలి వైపునకు దిగే క్రమంలో (man fell down while crossing iron gate) అదుపు తప్పి ధబేల్‌మని కిందపడిపోయాడు. ఈ ఘటనతో అతడికి తల నేలకు బలంగా తాకింది. దీంతో నొప్పి తాళలేక అతను విలవిల్లాడిపోయాడు. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Viral Video: పండుగపూట వాటర్‌ఫాల్స్ వద్దకు వెళ్తున్నారా.. అయితే ఇలాంటి తప్పులు మాత్రం చేయకండి..
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘రైలు పట్టాలను అడ్డదిడ్డంగా దాటడం చాలా ప్రమాదం’’.. అంటూ కొందరు, ‘‘ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లపైనే వెళ్లాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 లక్షలకు పైగా లైక్‌లు, 43 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: రోటీలు తినేముందు ఇది గమనిస్తున్నారా.. ఇతనెలా చేస్తున్నాడో చూస్తే నోరెళ్లబెడతారు..
ఇవి కూడా చదవండి..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..