Share News

Viral Video: ఊపిరి బిగపట్టి చూడాల్సిన వీడియో.. కొండపైకి ఎక్కతుండగా జారిపోయిన మహిళ.. చివరకు జరిగింది చూస్తే..

ABN , Publish Date - Jan 17 , 2025 | 08:43 PM

ఓ మహిళ తన స్నేహితులతో కలిసి కొండపై ట్రెక్కింగ్‌కు వెళ్తుంది. అంతా కలిసి పెద్ద కొండను ఎక్కేస్తారు. అయితే మధ్యలోకి వెళ్లాక.. ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. సదరు మహిళ కొండపై ఒక వైపు నుంచి మరో వైపునకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు జారిపోతుంది. అయితే..

Viral Video: ఊపిరి బిగపట్టి చూడాల్సిన వీడియో.. కొండపైకి ఎక్కతుండగా జారిపోయిన మహిళ.. చివరకు జరిగింది చూస్తే..

కొండల్లో ట్రెక్కింగ్ చేయడం ఓ వింత అనుభూతిని కలిగిస్తుంది. అయితే ఎంతో అనుభవం ఉన్న వారు మాత్రమే ఇలాంటి సాహసాలు చేయాల్సి ఉంటుంది. లేదంటే అనూహ్య ప్రమాదాల్లో చిక్కుకోవాల్సిన ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు కొందరు ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదాల్లో చిక్కుకోవడం చూస్తుంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ కొండపైకి ఎక్కుతుండగా సడన్‌గా జారిపోయింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ (woman) తన స్నేహితులతో కలిసి కొండపై ట్రెక్కింగ్‌కు (Trekking) వెళ్తుంది. అంతా కలిసి పెద్ద కొండను ఎక్కేస్తారు. అయితే మధ్యలోకి వెళ్లాక.. ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. సదరు మహిళ కొండపై ఒక వైపు నుంచి (woman slipped from the top of the hill) మరో వైపునకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు జారిపోతుంది. అయితే మధ్యలో రాయిని పట్టుకోవడంతో ఆగిపోతుంది.

Viral Video: కొంపముంచిన స్నేహితుడు.. వధువు ముందే వరుడి చెవిలో సీక్రెట్ చెప్పడంతో.. చివరకు..


అయితే మళ్లీ అదుపు తప్పి కిందకు జారిపోతూ ఉంటుంది. ఆమె లోయలోకి పడిపోవడాన్ని గమనించిన వ్యక్తి ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో తన కాలును ఆమె సమీపానికి తీసుకెళ్తాడు. అయితే కాలు పట్టుకుని పైకి వచ్చే క్రమంలో అతడి షూ ఊడి వచ్చేస్తుంది. దీంతో ఆమె మళ్లీ లోయలోకి జారిపోతుంటుంది. ఇంతలో అక్కడే ఉన్న మరో వ్యక్తి.. వారి వద్దకు వెళ్లి, ఎంతో చాకచక్యంగా ఆమెను పైకి లాగేస్తాడు. దీంతో ఎట్టకేలకు ఆమె ప్రమాదం నుంచి బయటపడుతుంది.

Viral Video: వామ్మో.. ఈమె టాలెంట్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. భర్తను భుజాలపై కూర్చోబెట్టుకుని మరీ..


కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. చూస్తుంటేనే భయమేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘సమయానికి దేవుడిలా వచ్చి కాపాడాడు’’.. అంటూ మరికొందరు, ‘‘ఇదంతా కెమెరా టెక్నిక్.. అక్కడే అంత లోయ ఏమీ లేదు’’.. అంటూ చాలా మంది అంటుండగా.. వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 వేలకు పైగా లైక్‌లు, 1.98 లక్షలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పరాయి వ్యక్తితో కారులో వెళ్తున్న భార్య.. బైకుపై వెనుకే వెళ్లిన భర్త.. చివరకు సినిమా తరహా ట్విస్ట్..

Updated Date - Jan 17 , 2025 | 08:43 PM