Share News

Viral Video: చెట్టులో ఇరుక్కున్న గాలిపటం కోసం.. ఇతను చేసిన పనికి అవాక్కైన వాహనదారులు.. చివరకు..

ABN , Publish Date - Jan 17 , 2025 | 05:02 PM

గాలి పటాలు ఎగురవేస్తుండగా తమాషా సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి గాలిపటాన్ని ఎగురవేస్తుండగా.. అది చివరకు పెద్ద చెట్టుకు తగులుకుని తెగిపోయింది. దీంతో ఆ వ్యక్తి ఎలాగైనా తన గాలిపటాన్ని తెచ్చుకోవాలని అనుకున్నాడు. తీరా చూస్తే..

Viral Video: చెట్టులో ఇరుక్కున్న గాలిపటం కోసం.. ఇతను చేసిన పనికి అవాక్కైన వాహనదారులు.. చివరకు..

సంక్రాంతి వచ్చిందంటే చాలు పిల్లలు నుంచి పెద్దల వరకూ అంతా గాలిపటాలు ఎగురవేస్తూ సందడి చేస్తుంటారు. అయితే ఇలాంటి సందర్భాల్లో అవగాహన లేక చాలా మంది ప్రమాదాలను కొని తెచ్చుకుంటుంటారు. కొందరు ఎదుటి వారికి ఇబ్బంది కలిగిస్తుంటారు. ఇలాంటి సంఘటనలు కొన్నిసార్లు చూసే వారికి తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. గాలిపటం చెట్టులో ఇరుక్కుపోవడంతో ఓ వ్యక్తి వాహనదారులకు పెద్ద షాక్ ఇచ్చాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. గాలి పటాలు ఎగురవేస్తుండగా తమాషా సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి గాలిపటాన్ని ఎగురవేస్తుండగా.. అది చివరకు పెద్ద చెట్టుకు (kite stuck on tree) తగులుకుని తెగిపోయింది. దీంతో ఆ వ్యక్తి ఎలాగైనా తన గాలిపటాన్ని తెచ్చుకోవాలని అనుకున్నాడు. తీరా చూస్తే అది రోడ్డు పక్కనే ఉన్న పెద్ద చెట్టుపై వేలాడుతూ కనిపించింది. దాన్ని ఎలా తీసుకోవాలా.. అని ఆలోచిస్తుండగా, చివరకు అతడికి ఓ బంపర్ ఐడియా తట్టింది.

Viral Video: రైల్వే ట్రాక్స్‌ను అడ్డదిడ్డంగా దాటకూడదనేది ఇందుకే.. ఇతడికేమైందో మీరే చూడండి..


రోడ్డుపై వస్తున్న వాహనాలను ఉపయోగించుకుని తన గాలిపట్టాన్ని తెచ్చుకోవాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా అటుగా వచ్చిన ఓ ట్రక్కును ఆపి, దానిపైకి ఎక్కేశాడు. ట్రక్కుపై నిలబడి ఎలాగోలా చివరకు తన గాలిపట్టాన్ని అయితే తెచ్చుకున్నాడు. అతడు గాలిపట్టాన్ని తీసుకుని కిందకు దిగే వరకూ.. ట్రక్కు డ్రైవర్ తన వాహనాన్ని రోడ్డు మధ్యలోనే నిలిపేశాడు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రక్కు వెనుక చాలా దూరం వరకూ (Traffic jam) వాహనాలన్నీ ఆగిపోయాయి. అంతా ఇతడి నిర్వాకం చూసి అవాక్కయ్యారు.

Viral Video: అరే..! ఇదేం మాయ.. ఇవి నీళ్లా లేక నిప్పు రవ్వలా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..


ఈ ఘటనను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మంచి పనే చేశారు.. లేదంటే వాహనదారుల గొంతకు తగులుకుని ప్రమాదం జరగకుండా ఉంటుంది’’.. అంటూ కొందరు, ‘‘ట్రాఫిక్ జామ్ అయినా కూడా.. వాహనదారులను ప్రమాదం నుంచి తప్పించాడు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5వేలకు పైగా లైక్‌లు, 1.31 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: రోటీలు తినేముందు ఇది గమనిస్తున్నారా.. ఇతనెలా చేస్తున్నాడో చూస్తే నోరెళ్లబెడతారు..


ఇవి కూడా చదవండి..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 17 , 2025 | 05:02 PM