Share News

Viral Video: పట్టుదల అంటే ఇదీ.. చేతులు లేకపోయినా ఎలా కష్టపడుతున్నాడో చూస్తే..

ABN , Publish Date - Jan 18 , 2025 | 09:24 PM

ఓ వ్యక్తి చేతులు లేకపోయినా కష్టపడుతున్న విధానం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తికి రెండు చేతులూ లేవు. అయినా ఏమాత్రం కుంగిపోలేదు. అడుక్కుని బతికే కంటే కష్టపడి బతకాలని నిర్ణయించుకున్నాడు. అది కూడా అందరితో సమానంగా కష్టపడాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. చివరకు అతను చేసిన పని చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..

Viral Video: పట్టుదల అంటే ఇదీ.. చేతులు లేకపోయినా ఎలా కష్టపడుతున్నాడో చూస్తే..

కొంతమంది చిన్న చిన్న సమస్యలకే కుంగిపోతుంటారు. మరికొందరు చివరకు ఆత్మహత్యలు చేసుకునే వరకూ వెళ్తుంటారు. ఇంకొందరు మాత్రం జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్లను ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటుంటారు. అయితే ఇలాంటి వారందరికీ కొందరు ఆదర్శంగా నిలుస్తుంటారు. అవయవాలు సక్రమంగా లేకపోయినా జీవితాన్ని రాజీపడకుండా గడుపుతూ అందరితో శభాష్ అనిపించుకుంటుంటారు. ఇలాంటి వారికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి చేతులు లేకపోయినా కష్టపడి పని చేయడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘పట్టుదల అంటే ఇదీ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి చేతులు లేకపోయినా కష్టపడుతున్న విధానం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తికి రెండు చేతులూ లేవు. అయినా ఏమాత్రం కుంగిపోలేదు. అడుక్కుని బతికే కంటే కష్టపడి బతకాలని నిర్ణయించుకున్నాడు. అది కూడా అందరితో సమానంగా కష్టపడాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు.

Viral Video: ఇల్లు మారుతూ మనసు గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..


చేతులు ఉన్న వారు కూడా సక్రమంగా చేయలేని పనిని తాను ఎంతో సులభంగా చేసేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. బరువైన మూటను ముందుగా నోటితో లాగి తన భుజంపై వేసుకున్నాడు. ఆ తర్వాత ఆ మూటను సరిగ్గా బ్యాలెన్స్ చేసుకుని, అక్కడి నుంచి పై అంతస్తులోకి (disabled man carrying bag) ఎంతో సులభంగా తీసుకెళ్లాడు. రెండు చేతులూ లేకపోయినా బరువైన మూటలను అందరితో సమానంగా మోయడం చూసి అంతా అతన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Viral Video: కాటేయకుండానే చుక్కలు చూపించిన పాము.. చేత్తో పట్టుకోవడంతో ఇతడికేమైందో మీరే చూడండి..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చేతులు లేకపోయినా ఇతను కష్టపడే విధానం ఎంతో గ్రేట్’’.. అంటూ కొందరు, ‘‘అందరూ ఇతన్ని ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకు వెళ్లాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 1.1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: చెట్టుకు కోపం వస్తే ఇలాగే ఉంటుందేమో.. బొప్పాయిని బలవంతంగా కోయాలని చూడగా.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 18 , 2025 | 09:24 PM