Share News

Viral Video: చెట్టుకు కోపం వస్తే ఇలాగే ఉంటుందేమో.. బొప్పాయిని బలవంతంగా కోయాలని చూడగా.. చివరకు..

ABN , Publish Date - Jan 18 , 2025 | 05:22 PM

ఓ వ్యక్తి బొప్పాయి కాయలను తెంపడానికి ఓ చెట్టు వద్దకు వెళ్తాడు. చెట్టు చాలా ఎత్తుగా ఉండడంతో కాయలను తెంపడం సాధ్యం కాదు. దీంతో ఓ పెద్ద కర్రను తీసుకొచ్చి, చెట్టుపై ఉన్న కాయలను తెంపేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది...

Viral Video: చెట్టుకు కోపం వస్తే ఇలాగే ఉంటుందేమో.. బొప్పాయిని బలవంతంగా కోయాలని చూడగా.. చివరకు..

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొందరు ప్లాన్ చేసుకుని మరీ వీడియోలు క్రియేట్ చేస్తుంటే.. మరికొందరు అనుకోని ప్రమాదాల్లో చిక్కుకుని నెట్టింట వైరల్ అవుతుంటారు. ఇలాంటి ఘటనలు కొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి చెట్టుపై ఉన్న బొప్పాయి కాయను బలవంతంగా కోయడానికి ప్రయత్నించాడు. అయితే చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘చెట్టుకు కోపం వస్తే ఇలాగే ఉంటుందేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి బొప్పాయి (papaya) కాయలను తెంపడానికి ఓ చెట్టు వద్దకు వెళ్తాడు. చెట్టు చాలా ఎత్తుగా ఉండడంతో కాయలను తెంపడం సాధ్యం కాదు. దీంతో ఓ పెద్ద కర్రను తీసుకొచ్చి, చెట్టుపై ఉన్న కాయలను తెంపేందుకు ప్రయత్నిస్తుంటాడు.

Viral Video: 13వ అంతస్తు నుంచి దూకేసిన వ్యక్తి.. వలలో నుంచి బయటికి వచ్చి మరీ.. చివరకు..


ఇలా కర్రతో కాయలను గట్టిగా పొడిచేస్తాడు. దీంతో చెట్టుపై ఉన్న కాయల్లో ఒకటి ఊడి, నేరుగా (papaya fell from tree on man's head) వచ్చి అతడి తలపై పడుతుంది. దెబ్బకు అతడికి చుక్కలు కనిపిస్తాయి. వామ్మో.. వాయ్యో.. అని అనుకుంటూ తలపై చేయి పెట్టి రుద్దుకుంటూ అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతాడు. ఈ సీన్ చూస్తుంటే.. కాయలను బలవంతంగా కోయడానికి ప్రయత్నించడంతో చెట్టుకు కోపం వచ్చి కాయతో కొట్టినట్లుగా అనిపించిందని పలువురు నవ్వుకుంటున్నారు.

Viral Video: పరాయి వ్యక్తితో కారులో వెళ్తున్న భార్య.. బైకుపై వెనుకే వెళ్లిన భర్త.. చివరకు సినిమా తరహా ట్విస్ట్..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చెట్టుకు కోపం వస్తే ఇలాగే ఉంటుంది మరి’’.. అంటూ మరికొందరు, ‘‘బొప్పాయి గురి తప్పలేదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 12 లక్షలకు పైగా లైక్‌‌లు, 61.8 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: రైల్వే గేటు వద్ద వేచి ఉన్న బైకర్.. ట్రైన్ కంటే ముందే దూసుకొచ్చిన ప్రమాదం.. చూస్తే నవ్వు ఆపుకోలేరు..


ఇవి కూడా చదవండి..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 18 , 2025 | 05:22 PM