Viral Video: అప్‌డేట్ అవ్వడమంటే ఇదేనేమో.. పాత బైకును ఇతనెలా మార్చాడో చూస్తే..
ABN , Publish Date - Jan 18 , 2025 | 09:53 PM
ఓ వ్యక్తి పాత ప్యాషన్ ప్రో బైకుపై రావడాన్ని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. అతను తన పాత బైకును సరికొత్తగా మార్చడమే ఈ వీడియో వైరల్ అవడానికి కారణమైంది. పెట్రోల్ బైకును కాస్తా.. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా..

వాహనాలను చిత్రవిచిత్రంగా మార్చేవారిని చూస్తుంటాం. కొందరు పాత విడి భాగాలతో వినూత్న వాహనాలను తయారు చేస్తుంటే.. మరికొందరు టెక్నాలజీని వాడి తమ వాహనాలను అధునాతనంగా మార్చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన పాత బైకును సరికొత్తగా మార్చడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘అప్‌డేట్ అవ్వడమంటే ఇదేనేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పాత ప్యాషన్ ప్రో బైకుపై (Hero Passion Pro Bike) రావడాన్ని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. అతను తన పాత బైకును సరికొత్తగా మార్చడమే ఈ వీడియో వైరల్ అవడానికి కారణమైంది. పెట్రోల్ బైకును కాస్తా.. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా బ్యాటరీ బైకుగా (Battery bike) మార్చేశాడు.
Viral Video: పట్టుదల అంటే ఇదీ.. చేతులు లేకపోయినా ఎలా కష్టపడుతున్నాడో చూస్తే..
బైకు ఇంజిన్ స్థానంలో బ్యాటరీని అమర్చడాన్ని వీడియోలో చూడొచ్చు. అలాగే స్పీడో మీటర్‌పై బ్యాటరీ ఈ- రిక్షా మీటర్‌ను ఏర్పాటు చేశారు. అంతా ఈ వాహనాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. పెట్రోల్ వాహనాన్ని బ్యాటరీ బైకుగా మార్చేందుకు రూ.70వేలు ఖర్చయిందని ఆ వ్యక్తి తెలిపాడు. అలాగే ఒకసారి చార్జ్ చేస్తే.. సుమారు 80 నుంచి 90 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చని చెప్పాడు. తన బైకును లక్నోలో మార్పించినట్లు బదిలిచ్చాడు.
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అంకుల్ అప్‌డేట్ అయ్యాడుగా’’.. అంటూ కొందరు, ‘‘పెట్రోల్ బైకు టూ బ్యాటరీ బైక్.. సూపర్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 వేలకు పైగా లైక్‌లు, 91 వేలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: చెట్టుకు కోపం వస్తే ఇలాగే ఉంటుందేమో.. బొప్పాయిని బలవంతంగా కోయాలని చూడగా.. చివరకు..
ఇవి కూడా చదవండి..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..