Marriage Funny Video: పెళ్లిలో అతిథులకు వింత కష్టం.. ఏం చేస్తున్నారో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
ABN , Publish Date - May 07 , 2025 | 01:27 PM
ఓ వివాహ కార్యక్రమంలో అతిథులుకు వింత కష్టం వచ్చిపడింది. వివాహం జరుగుతున్న సమయంలో అతిథుల సౌకర్యార్థం.. పెద్ద పెద్ద టెంట్లు వేశారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..

వివాహ కార్యక్రమాల్లో వింత సంఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. కొన్నిసార్లు వరుడికి, మరికొన్నిసార్లు వధువుకు వింత వింత సమస్యలు ఎదురవడం చూస్తుటాం. ఇలాంటి తమాషా సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, పెళ్లికి వచ్చిన బంధువులకు ఎదురైన విచిత్ర అనుభవానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీియో చూసిన వారంతా.. ‘‘వారి పెళ్లి వీరి చావుకొచ్చింది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (Marriage) కార్యక్రమంలో అతిథులుకు వింత కష్టం వచ్చిపడింది. వివాహం జరుగుతున్న సమయంలో అతిథుల సౌకర్యార్థం.. పెద్ద పెద్ద టెంట్లు వేశారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
Sparrow Viral Video: మచ్చుకైనా లేని మానవత్వానికి కనువిప్పు.. ఈ పిచ్చుక చేసిన పని చూస్తే..
అకస్మాత్తుగా తుఫాను, ఈదురుగాలులు మొదలవడంతో (tent blown away by the wind) టెంట్ గాలికి లేచిపోయింది. దీన్ని గమనించిన అతిథులు.. టెంట్ గాలికి ఎగిరిపోకుండా గట్టిగా పట్టుకున్నారు. ఒక్కో కర్ర వద్ద ఐద, ఆరుమందికి పైగా నిలబడి మరీ కర్రలను గట్టిగా పట్టుకున్నారు. చాలా సేపు టెంట్ ఎగిరిపోకుండా పట్టకున్నారు. అయితే గాలులు బీభత్సంగా వీయడంతో చివరకు టెంట్ మొత్తం గాల్లోకి ఎగిరిపోయింది. అప్పటిదాకా టెంట్‌ను పట్టుకున్నా.. చివరకు సాధ్యం కాకపోవడంతో వదిలేసి పారిపోయారు.
Bull Viral Video: పేరుకే ఎద్దు.. ప్రవర్తనలో కాదు.. నీళ్లు ఎలా తాగుతుందో చూస్తే..
ఇలా వివాహానికి వచ్చిన అతిథులకు పెద్ద కష్టం వచ్చిపడిందన్నమాట. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వారి పెళ్లి వీరి చావుకు వచ్చిందిగా’’. అంటూ కొందరున, ‘‘ ఈ పెళ్లి చిరకాలం గుర్తుండిపోతుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 2.7 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Funny Viral Video: మేడమైన అమ్మాయిని చూడగానే ఐఫోన్ ఇచ్చేశాడు.. తర్వాత పైకి చూసి ఖంగుతిన్నాడు..
ఇవి కూడా చదవండి..
Woman Funny Video: కాళ్లను ఇలా ఎవరైనా కడుగుతారా.. ఈ యువతికి చివరికి ఏమైందో చూస్తే..
Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..
Stunts Viral Video: చావు అంచుల దాకా వెళ్లడమంటే ఇదే.. వ్యూస్ కోసం వీళ్ల నిర్వాకం చూస్తే..