Share News

Monkey Funny Video: సెల్ఫీ తీసుకునే ముందు ఆలోచించాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..

ABN , Publish Date - May 04 , 2025 | 07:32 PM

ఓ యువతి రోడ్డుపై వెళ్తుండగా.. పక్కన ఉన్న గోడపై ఓ కోతిని గొలుసుతో కట్టేసి ఉంటారు. ఆ కోతిని చూడగానే యువతి ఆగిపోతుంది. కోతికి గొలుసు కట్టేసి ఉండడంతో ఏమీ చేయలేదనే ఉద్దేశంతో దగ్గరికి వెళ్తుంది. అయితే చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Monkey Funny Video: సెల్ఫీ తీసుకునే ముందు ఆలోచించాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..

కొందరికి సెల్ఫీలు తీసుకోవడమంటే ఇష్టం.. మరికొందరు సెల్ఫీలు తీసుకోవడమే పనిగా పెట్టుకుని ఉంటారు. ఇంకొందరు సమయం, సందర్భం లేకుండా సెల్ఫీలు తీసుకుంటూ చివరకు ప్రమాదాల బారిన పడుతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి కోతి పక్కన సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించింది. అయితే చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు .. ‘‘ సెల్ఫీ తీసుకునే ముందు ఆలోచించాలనేది ఇందుకే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ పాత వీడియో (Viral Video) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి రోడ్డుపై వెళ్తుండగా.. పక్కన ఉన్న గోడపై ఓ కోతిని గొలుసుతో కట్టేసి ఉంటారు. ఆ కోతిని చూడగానే యువతి ఆగిపోతుంది. కోతికి గొలుసు కట్టేసి ఉండడంతో ఏమీ చేయలేదనే ఉద్దేశంతో దగ్గరికి వెళ్తుంది.

Woman Viral Video: గాలిలో విహరిస్తున్న యువతి.. సడన్‌గా షాకింగ్ సీన్.. చివరకు చూస్తే..


పనిలో పనిగా.. కోతితో ఓ సెల్ఫీ తీసుకుంటే పోలా.. అని అనుకుంటూ మరింత దగ్గరికి వెళ్లి, ఫోన్‌తో (Young woman tries to take selfie with monkey) సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంతలో కోతికి చిర్రెత్తుకొచ్చి ఒక్కసారిగా ఆమె పైకి దూకుతుంది. ఆమె తలపై కూర్చుని ముఖంపై ఉన్న గుడ్డను పీకేసి, గోర్లతో రక్కేస్తుంది. అయితే ముఖానికి గుడ్డ కట్టుకుని ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మొత్తానికి సెల్ఫీ తీసుకోబోయిన యువతికి.. కోతి ఇలా షాక్ ఇచ్చిందన్నమాట.

Snake Viral Video: పాము ముందు నాగిని పాట.. సడన్‌గా ఎవరూ ఊహించని షాకింగ్ ట్విస్ట్..


ఈ ఘటనతో ఆ యువతితో పాటూ అక్కడున్న వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీ తీసుకోవాలని చూస్తే ఇలాగే అవుతుంది’’.. అంటూ కొందరు, ‘‘యువతికి షాక్ ఇచ్చిన కోతి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Funny Viral Video: మేడమైన అమ్మాయిని చూడగానే ఐఫోన్ ఇచ్చేశాడు.. తర్వాత పైకి చూసి ఖంగుతిన్నాడు..


ఇవి కూడా చదవండి..

Woman Funny Video: కాళ్లను ఇలా ఎవరైనా కడుగుతారా.. ఈ యువతికి చివరికి ఏమైందో చూస్తే..

Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Stunts Viral Video: చావు అంచుల దాకా వెళ్లడమంటే ఇదే.. వ్యూస్ కోసం వీళ్ల నిర్వాకం చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 04 , 2025 | 07:32 PM