Viral Video: స్కూటీపై వెళ్తూ అదుపు తప్పి లారీ కిందపడ్డాడు.. చివరకు జరిగింది చూస్తే షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Feb 06 , 2025 | 09:12 PM
ఓ వ్యక్తి స్కూటీపై వెళ్తుంటాడు. మార్గ మధ్యలో బండి స్కిడ్ అవడంతో కిందపడతాడు. అదే సమయంలో అటుగా లారీ రావడంతో దాని మధ్యలో పడిపోతాడు. చివరకు ఏం జరిగిందో చూడండి..

ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలు వాహనదారుల నిర్లక్ష్యం వల్లే జరుగుతుంటాయి. అయితే ఇలాంటి సమయాల్లో అప్పుడప్పుడూ ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి క్షేమంగా బయటపడడం చూస్తుంటాం. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి స్కూటీపై వెళ్తూ మార్గ మధ్యలో ప్రమాదవశాత్తు లారీ కిందపడతాడు. అయితే చివరకు ఏం జరిగిందో చూసి అంతా షాక్ అవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి స్కూటీపై వెళ్తుంటాడు. మార్గ మధ్యలో బండి స్కిడ్ అవడంతో కిందపడతాడు. అయితే అదే సమయంలో అటుగా లారీ రావడంతో (scooterist fell under lorry) దాని మధ్యలో పడిపోతాడు. లారీ వెనుక టైరు అతడి తల మీదుగా దూసుకుపోయినట్లు కనిపిస్తుంది. ప్రమాదాన్ని గమనించిన లారీ డ్రైవర్ వెంటనే వాహనాన్ని ఆపేస్తాడు.
ప్రమాదం జరగడం చూసి చుట్టూ ఉన్న వాహనదారులు కూడా ఆపేసి, ఏం జరిగిందో అని కంగారుపడతారు. లారీ కిందపడిపోయిన వ్యక్తి చనిపోయి ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ ఇంతలో ఆ వ్యక్తి మెల్లగా పైకి లేచి, అక్కడ పడిపోయిన హెల్మెట్ తీసుకుని.. స్కూటీ స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి తాపీగా వెళ్లిపోతాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. అంత పెద్ద ప్రమాదం జరిగినా అతడికి ఏమీ కాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
Viral Video: ఇంట్లో ఎగురుతున్న హెలీకాప్టర్.. వీళ్ల క్రియేటివిటీ మామూలుగా లేదుగా..
అయితే హెల్మెట్ ఉండడం వల్లే అతడికి ఏమీ కాలేదని తెలుస్తోంది. కాగా, ఈ ఘటనను కారులో వెళ్తున్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘హెల్మెట్ ఉండడం వల్లే అతడికి ఏమీ కాలేదు’’.. అంటూ కొందరు, ‘‘ఈ ప్రమాదం చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 200కి పైగా లైక్‌లు, 43 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..