Viral Video: ఇంట్లో ఎగురుతున్న హెలీకాప్టర్.. వీళ్ల క్రియేటివిటీ మామూలుగా లేదుగా..
ABN , Publish Date - Feb 06 , 2025 | 08:30 PM
ఓ వ్యక్తి తన ఇంట్లో హెలీకాప్టర్ ఎగురుతున్నట్లు క్రియేట్ చేశాడు. ఇందుకోసం ఓ హెలీకాప్టర్ బొమ్మను తీసుకొచ్చాడు. అది గాల్లో ఎగిరేలా సెట్ చేసేందుకు.. చివరకు సీలింగ్ ఫ్యాన్‌ను వాడుకున్నాడు. ఫ్యాన్ కింది భాగంలో..

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో కొందరు ఆలోచన వచ్చిందే తడవుగా దాన్ని ఆచరరణలో పెట్టేస్తు్న్నారు. ఈ క్రమంలో చాలా మంది చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. కొందరు ఇంట్లోని వస్తువులతో వింత వింత వస్తువులను, వాహనాలను తయారు చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన ఇంట్లో హెలీకాప్టర్ ఎగురుతున్నట్లుగా చేసిన ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వీళ్ల క్రియేటివిటీ మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఇంట్లో హెలీకాప్టర్ ఎగురుతున్నట్లు క్రియేట్ చేశాడు. ఇందుకోసం ఓ హెలీకాప్టర్ బొమ్మను తీసుకొచ్చాడు. అది గాల్లో ఎగిరేలా సెట్ చేసేందుకు.. చివరకు సీలింగ్ ఫ్యాన్‌ను వాడుకున్నాడు. ఫ్యాన్ కింది భాగంలో (Helicopter attached to ceiling fan) హెలీకాప్టర్ బొమ్మను సెట్ చేశాడు.
ఫ్యాన్‌ను ఆన్ చేయగా.. దూరం నుంచి చూసేవాళ్లకు హెలీకాప్టర్ రెక్కలు తిరుగుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. హెలీకాప్టర్ ఇంటి సీలింగ్‌పై ఎగురుతుందేమో అన్నట్లుగా ఉంది. అలాగే ఆ హెలీకాప్టర్ డోరు తెరిచి ఓ సైనికుడు కిందకు దూకేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. దీంతో అంతా ఈ హెలీకాప్టర్‌ను ఆసక్తిగా గమనిస్తున్నారు.
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘హెలీకాప్టర్ ఫ్యాన్ అద్భుతంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘మీ క్రియేషన్ వినూత్నంగా ఉంది బ్రదర్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.50 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Viral Video: ఆన్‌లైన్ క్లాస్‌కు వచ్చి అవాక్కైన టీచర్.. మధ్యలో ఓ బాలిక ఏం చేసిందో చూడండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..