Share News

Viral Video: ఆన్‌లైన్ క్లాస్‌‌కు వచ్చి అవాక్కైన టీచర్.. మధ్యలో ఓ బాలిక ఏం చేసిందో చూడండి..

ABN , Publish Date - Feb 06 , 2025 | 05:51 PM

ఓ టీచర్ తన విద్యార్థులందరితో ఆన్‌‌లైన్ క్లాసు ఏర్పాటు చేసింది. దీంతో విద్యార్థులంతా ఒక్కొక్కరుగా ఆన్‌లైన్ తరగతిలోకి జాయిన్ అవుతున్నారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఓ తమాషా సంఘటన చోటు చేసుకుంది..

Viral Video: ఆన్‌లైన్ క్లాస్‌‌కు వచ్చి అవాక్కైన టీచర్.. మధ్యలో ఓ బాలిక ఏం చేసిందో చూడండి..

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో అంతా ఆన్‌‌లైన్ మయమైంది. ఏది కొనాలన్నా, విక్రయించాలన్నా ఆన్‌లైన్ వేదికగా మారుతోంది. ఆఖరికి స్కూల్ తరగతులు కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహించే వెలుసుబాటు వచ్చేసింది. అయితే టెక్నాలజీపై అవగాహన ఉన్న వారు ఒకే గానీ.. ఏమాత్రం అవగాహన లేని వారు మాత్రం కొన్నిసార్లు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది. అలాగే మరికొన్నిసార్లు నవ్వులపాలుకావాల్సి వస్తుంటుంది. ఇందుకు నిదర్శనంగా అనేక వీడియోలను సోషల్ మీడియాలో చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆన్‌లైన్‌ క్లాస్‌కు నిర్వహించిన టీచర్.. చివరకు అవాక్కవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఓ విద్యార్థి చేసిన నిర్వాకంతో చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ టీచర్ తన విద్యార్థులందరితో ఆన్‌‌లైన్ క్లాసు (Online class) ఏర్పాటు చేసింది. దీంతో విద్యార్థులంతా ఒక్కొక్కరుగా ఆన్‌లైన్ తరగతిలోకి జాయిన్ అవుతున్నారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఓ తమాషా సంఘటన చోటు చేసుకుంది. అందంగా ముస్తాబై వచ్చిన టీచర్‌ను చూసి ఓ విద్యార్థి విచిత్రమైన కామెంట్లు చేసింది.

Viral Video: పెళ్లిలో మెహందీ పెట్టుకున్న వధువు.. తెల్లారిన తర్వాత చూసుకోగా షాకింగ్ సీన్..


ఆన్‌లైన్‌ తరగతులపై పెద్దగా అవగాహన లేని బాలిక.. మైక్ ఆన్ అయిన విషయం (student comment on teacher's make-up) తెలీక టీచర్‌పై కామెంట్లు చేసింది. ‘‘టీచర్ చూడు సోషల్ స్టడీస్ పేరుతో మేకప్ అయి వచ్చింది’’.. అంటూ ఇంట్లో వాళ్లకు చెప్పడం స్టార్ట్ చేసింది. ‘‘లిప్ స్టిక్, చెవిపోగులు, హైలైటర్, కాజల్ కూడా వేసుకుని వచ్చింది’’.. అని టీచర్‌ను కామెంట్ చేసింది. బాలిక మాటలు విన్న టీచర్ షాకై.. అలాగే చూస్తుండిపోయింది. బాలిక కామెంట్ చేయడం విని మిగతా విద్యార్థులంతా నవ్వుకుంటారు.

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడమంటే ఇదే.. ఎద్దుకు సాయం చేసిన ఈ వ్యక్తి పరిస్థితి.. చివరకు..


కొందరు కెమెరా నుంచి పక్కకు తప్పుకొని మరీ నవ్వుకుంటారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మనసులో మాటను బయటపెట్టిందిగా’’.. అంటూ కొందరు, ‘‘టీచర్ నిస్సహాయంగా చూడడం నవ్వు తెప్పించేలా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7.3 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Train Viral Video: రైల్లో కిక్కిరిసిన జనం.. కిందపడకుండా ఇతనేం చేశాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..


ఇవి కూడా చదవండి..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 06 , 2025 | 05:51 PM