Viral Video: పెళ్లిలో మెహందీ పెట్టుకున్న వధువు.. తెల్లారిన తర్వాత చూసుకోగా షాకింగ్ సీన్..
ABN , Publish Date - Feb 05 , 2025 | 09:57 PM
ఓ వివాహ కార్యక్రమంలో వధువు అందరిలాగానే చేతులు, కాళ్లకు మెహందీ పెట్టుకుంది. ఇందులో షాక్ అవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా.. మెహందీ పెట్టుకున్న తర్వాత వధువుకు విచిత్ర అనుభవం ఎదురైంది. రాత్రి మెహందీ పెట్టుకున్న వధువు ఉదయం చూసుకుని షాక్ అయింది...

శుభకార్యం అనగానే మహిళలకు ముందుగా గుర్తొచ్చేది మెహందీ. మహిళలంతా చేతులు, కాళ్లకు మెహందీ పెట్టుకుని వేడుకల్లో సందడి చేస్తుంటారు. వీరి అభిరుచికి తగ్గట్టుగా చాలా మంది మెహందీని వివిధ రకాల డిజైన్లలో వేస్తుంటారు. ఇక పెళ్లిళ్లలో అయితే వధువులు కొత్త కొత్త డిజైన్లలో మెహందీ పెట్టుకుని అందరిలో ప్రత్యేకంగా నిలుస్తుంటారు. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నామంటే.. తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో ఓ వధువుకు వింత సమస్య వచ్చి పడింది. చేతులకు మెహందీ పెట్టుకున్న వధువు.. తెల్లారిన తర్వాత చూసుకుని షాక్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (Marriage) కార్యక్రమంలో వధువు అందరిలాగానే చేతులు, కాళ్లకు మెహందీ పెట్టుకుంది. ఇందులో షాక్ అవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా.. మెహందీ పెట్టుకున్న తర్వాత వధువుకు విచిత్ర అనుభవం ఎదురైంది. రాత్రి మెహందీ పెట్టుకున్న వధువు (bride wearing mehndi ) .. ఉదయం లేచిన తర్వాత చేతులు కడుక్కుని చూడగా.. మొత్తం ఎర్రగా మారిపోయింది.
Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడమంటే ఇదే.. ఎద్దుకు సాయం చేసిన ఈ వ్యక్తి పరిస్థితి.. చివరకు..
ఎర్రగా మారడమంటే రంగు కాదు. చేయి పూర్తిగా ఉబ్బిపోయి, బొబ్బలు వచ్చి ఎర్రగా మారిపోతుంది. మెహందీ పెట్టుకుంటే చివరకు తన చేయి ఇలా అవడం చూసి వధువు షాక్ అయింది. చివరకు వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. మెహందీ కంపెనీ తనకు గుర్తు లేదని, కానీ నిపుణులను పిలిపించి మెహందీ పెట్టించుకున్నామని వధువు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అరే.. మెహందీ పెట్టుకుంటే ఇలా జరగడమేంటీ’’.. అంటూ కొందరు, ‘‘కొత్త కొత్త కంపెనీల మెహందీలను వాడొద్దు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 67 వేలకు పైగా లైక్‌లు, 5.7 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Tiger Viral Video: ప్రాణభయం అంటే ఇదేనేమో.. ఒకే బావిలో పులి, పంది.. చివరకు జరిగింది చూస్తే..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..