Viral Video: వీళ్లు మనుషులేనా.. రైల్లో చిరు వ్యాపారిని ఎలా మోసం చేస్తున్నారో చూడండి..
ABN , Publish Date - Feb 22 , 2025 | 08:13 AM
రైలు ప్రయాణానికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కదులుతున్న రైళ్లలో విచిత్ర విన్యాసాలు చేస్తూ కొందరు, సీట్ల కోసం కుస్తీలు పడుతూ ఇంకొందరు అందరినీ షాక్‌కు గురి చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. అయితే..

రైలు ప్రయాణానికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కదులుతున్న రైళ్లలో విచిత్ర విన్యాసాలు చేస్తూ కొందరు, సీట్ల కోసం కుస్తీలు పడుతూ ఇంకొందరు అందరినీ షాక్‌కు గురి చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. అయితే, తాజాగా, రైల్లో ప్రయాణికుల నిర్వాకం చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్లో చిరు వ్యాపారిని మోసం చేసిన ప్రయాణికుల వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘వీళ్లు మనుషులేనా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రద్దీగా ఉన్న ఓ రైల్లో (Train) ప్రయాణికుల నిర్వాకం చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ చిరు వ్యాపారి రద్దీగా ఉన్న ప్రయాణికుల మధ్య విత్తనాలను విక్రయిస్తున్నాడు. అడుగు తీసి అడుగు వేయడానికి కూడా కష్టంగా ఉన్నా.. పొట్టకూటి కోసం వ్యాపారం చేస్తున్న అతన్ని ప్రయాణికుల మోసం చేశారు.
Woman Funny Video: ఎలాగైనా ఎక్కి తీరాల్సిందే.. ఎక్సలేటర్‌పై ఈమె నిర్వాకం చూస్తే..
వ్యాపారి తల మీద ఉన్న బుట్టలో చేతులు పెట్టి మరీ (Passengers cheated the vendor) విత్తనాలను తీసుకుంటున్నారు. కొందరు వాటిని తీసుకుని, వారి వెనుక ఉన్న వారికి అందిస్తున్నారు. కొద్ది సేపటి తర్వాత ప్రయాణికులు చేస్తున్న మోసాన్ని పసిగట్టిన సదరు వ్యాపారి.. వారిని నిలదీస్తాడు. అయినా వారు మాత్రం అదేమీ పట్టించుకోకుండా విత్తనాలను తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. దీంతో చివరకు ఆ వ్యాపారి అక్కడి నుంచి ముందుకు వెళ్లిపోతాడు.స
Tiger And Bull Video: ఎద్దుపై పులి ఊహించని దాడి.. చివరకు జరిగింది చూస్తే.. షాకవ్వాల్సిందే..
ఇలా వారంతా కలిసి చిరు వ్యాపారిని మోసం చేయడం చూసి చుట్టు పక్కల ఉన్న ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చిరు వ్యాపారి పొట్ట కొట్టడం మహా పాపం’’.. అంటూ కొందరు, ‘‘వీళ్లు మనుషులేనా.. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7వేలకు పైగా లైక్‌లు, 1.6 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
ఇవి కూడా చదవండి..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..