Viral Video: గుండెపోటుతో చనిపోయాడని అంతా అనుకున్నారు.. చివరకు పెళ్లి వీడియోలో చూడగా షాకింగ్ సీన్..
ABN , Publish Date - Feb 23 , 2025 | 12:40 PM
వివాహ వేడుకలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ పెళ్లికి వచ్చిన వారిలో ఓ వ్యక్తి ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోయాడు. అతను గుండెపోటుతో చనిపోయాడని అంతా అనుకున్నారు. అయితే చివరకు పెళ్లి వీడియోలో చూడగా షాకింగ్ సీన్ కనిపించింది..

కొన్నిసార్లు కొందరి నిరక్ష్యం ఎదుటి వారిని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటుంది. మరికొన్నిసార్లు ఏకంగా ప్రాణాలు కూడా తీస్తుంటుంది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివాహ కార్యక్రమంలో ఓ వ్యక్తి అకస్మా్త్తుగా ప్రాణాలు కోల్పోయాడు. అంతా గుండెపోటుతో చనిపోయాడని అనుకున్నారు. అయితే చివరకు పెళ్లి వీడియోలో చూసి షాక్ అయ్యారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పంజాబ్‌లోని (Punjab) జలంధర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా జరిగిన వివాహ (Marriage) వేడుకలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ పెళ్లికి వచ్చిన వారిలో పరమ్‌జీత్ సింగ్ అనే 45 వ్యక్తి కూడా ఉన్నాడు. అయితే పెళ్లికి జరిగిన వేడుకలో ఉన్నట్టుండి పరమ్‌జీత్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. అతను గుండెపోటుతో చనిపోయాడని తల్లిదండ్రులతో పాటూ అంతా అనుకున్నారు. మృతదేహానికి అంత్యక్రియలు కూడా నిర్వహించారు.
అయితే ఆ తర్వాత పెళ్లికి సంబంధించిన ఓ వీడియోలో షాకింగ్ సీన్ కనిపించింది. పెళ్లి వేడుకలో డాన్స్ చేస్తున్న యువకుల్లో ఒకతను తుపాకీతో (Gun firing) గాల్లోకి కాల్పులు జరుపుతున్నాడు. అక్కడే డాన్స్ వేస్తున్న పరమ్‌జీత్ సింగ్.. కాసేపటి తర్వాత తుపాకీకి దగ్గరగా వెళ్లాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో తుపాకీని అతడి వైపు గురిపెట్టి కాల్చాడు. బుల్లెట్ అతడి గుండెల్లోకి దూసుకెళ్లడంతో (Man dies due to gunshot) అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. ఈ వీడియో పోలీసుల వరకూ చేరడంతో దర్యాప్తు ప్రారంభించారు.
సదరు యువకుడు కావాలనే అతన్ని కాల్చాడా, లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో పాపం.. ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘ఒకరి నిర్లక్ష్యానికి ఇంకొకరు బలవడమంటే ఇదే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Viral Video: కారు వెనుక చూస్తే ఖంగుతింటారు.. యజమాని తెలివి మామూలుగా లేదుగా..
ఇవి కూడా చదవండి..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..