Share News

Viral Video: ఏనుగుల పంట పండిందిగా.. రోడ్డుపై నారింజ పండ్ల ట్రక్కు ఆగిపోవడంతో.. చివరకు..

ABN , Publish Date - Feb 23 , 2025 | 07:48 AM

నారింజ పండ్ల లోడుతో వెళ్తున్న ఓ పెద్ద ట్రక్కు మార్గ మధ్యలో పంక్షర్ అయింది. దీంతో డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కన ఆపాడు. తర్వాత డ్రైవర్, క్లీనర్ కలిసి టైరు మార్చేందుకు సిద్ధమయ్యారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ..

Viral Video: ఏనుగుల పంట పండిందిగా.. రోడ్డుపై నారింజ పండ్ల ట్రక్కు ఆగిపోవడంతో.. చివరకు..

ఏనుగులకు ఆకలేస్తే ఏం చేస్తాయో అందరికీ తెలిసిందే. పెద్ద పెద్ద చెట్లను సైతం విరిచి పండ్లను తింటుంటాయి. ఏమీ దొరకని పక్షంలో కొన్నిసార్లు రోడ్ల పైకి వచ్చి, వాహనాలను ఆపి మరీ ఆహారాన్ని బలవంతంగా లాక్కుంటుంటాయి. మరికొన్ని ఏనుగులు ఇళ్లు, దుకాణ షట్టర్లను ధ్వంసం చేసి మరీ బియ్యం, పండ్లు తదితరాలను తినేయడం కూడా చూశాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. నారింజ పండ్లతో ఉన్న ట్రక్కు రోడ్డుపై ఆగిపోవడంతో ఏనుగులు చుట్టుముట్టాయి. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో (South Africa) చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. నారింజ పండ్ల లోడుతో వెళ్తున్న ఓ పెద్ద ట్రక్కు మార్గ మధ్యలో పంక్షర్ అయింది. దీంతో డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కన ఆపాడు. తర్వాత డ్రైవర్, క్లీనర్ కలిసి టైరు మార్చేందుకు సిద్ధమయ్యారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఊహించని ఘటన చోటు చేసుకుంది.

Viral Video: బర్త్ డే యువతికి షాక్.. కేక్ కట్ చేయాలని చూడగా.. చివరకు జరిగిందిదీ..


లారీ ఆగిన ప్రదేశం అటవీ ప్రాంతం కావడంతో అటుగా వెళ్తున్న ఏనుగులు.. నారింజ పండ్లను గమనించాయి. ఇంకేముందీ.. ఏనుగులన్నీ కలిసి లారీని ఒక్కసారిగా చుట్టుముట్టాయి. తొండాల సాయంతో లారీలోని (elephants ate oranges in lorry) నారింజ పండ్లను లాగేసుకుని మరీ తినేశాయి. ఇలా ఏనుగులన్నీ కలిసి చాలా సేపు లారీ వద్దే నిలబడి, పండ్లను తినేశాయి. లారీ డ్రైవర్, క్లీనర్ దీన్ని గమనించినా ఏమీ చేయలేని పరిస్థితి కావడంతో అలాగే చూస్తుండిపోయారు.

Farming Viral Video: ఇది కదా తెలివంటే.. క్యారెట్లను కడిగేందుకు ఈ రైతు చేసిన పని చూడండి..


కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రాకలుగా స్పందిస్తున్నారు. ‘‘ఏనుగుల పంట పండిందిగా’’.. అంటూ కొందరు, ‘‘మొత్తానికి ఏనుగుల ఆకలి తీరిపోయింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Marriage Funny Video: చెడగొట్టారు కదరా.. జ్యూస్‌లో మందు కలిపి వరుడికి ఇవ్వడంతో.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..

Viral Video: ఈ కారును ఫోలో చేస్తే గజగజా వణికిపోవాల్సిందే.. సమీపానికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్..

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 23 , 2025 | 07:48 AM