Viral Video: కారు వెనుక చూస్తే ఖంగుతింటారు.. యజమాని తెలివి మామూలుగా లేదుగా..
ABN , Publish Date - Feb 23 , 2025 | 11:57 AM
వాహనాలను చిత్రవిచిత్ర ఆకారాల్లో తయారు చేసే వారిని చూశాం. అలాగే వాహనం వెనుక వింత వింత వస్తువులను పెడుతూ అందరినీ ఆకట్టుకునే యజమానులను కూడా చూశాం. వీటితో పాటూ కొందరు వాహన యజమానులు వెనుక వైపు వివిధ రకాల కొటేషన్లను రాస్తుంటారు. ఇలాంటి ..

వాహనాలను చిత్రవిచిత్ర ఆకారాల్లో తయారు చేసే వారిని చూశాం. అలాగే వాహనం వెనుక వింత వింత వస్తువులను పెడుతూ అందరినీ ఆకట్టుకునే యజమానులను కూడా చూశాం. వీటితో పాటూ కొందరు వాహన యజమానులు వెనుక వైపు వివిధ రకాల కొటేషన్లను రాస్తుంటారు. ఇలాంటి కొన్ని కొటేషన్లు అందరినీ ఆకట్టుకుంటుంటే.. మరికొన్ని అందరినీ ఆలోచింపజేస్తుంటాయి. అలాగే ఇంకొన్ని కొటేషన్ల తెగ నవ్విస్తుంటాయి. తాజాగా, ఇలాంటి కారుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఈ కారు యజమాని తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పూణేకు (Pune) చెందిన ఓ కారు యజమాని అందరినీ తెగ నవ్విస్తున్నాడు. కారు వెనుక అతను రాసిన సందేశమే ఇందుకు కారణం. సాధారణంగా చాలా మంది తమ వాహనాల వెనుక భాగంలో వింత వింత కొటేషన్లను (Strange quotations) రాయడం చూస్తుంటాం. వాహనం నేర్చుకుంటున్న వారైతే.. అందుకు తగ్గట్టుగా వివిధ రకాల కొటేషన్లు రాస్తుంటారు.
మరికొందరు.. ‘‘నన్ను చూసి ఏడవకు.. అప్పు చేసి కొన్నా’’.., ‘‘అసూయా..! నీకో నమస్కారం’’.., ‘‘వెంటపడితే చస్తావు’’.., ‘‘నీ కోరచూపులు విసరకు, నన్ను పిచ్చివాడ్ని చేయకు’’.. ఇలా వింత వింత కొటేషన్లను రాయడం చూస్తుంటాం. అయితే ఈ కారు యజమాని తన వాహనం వెనుక.. ‘‘ఇక్కడ నేర్చుకుంటే.. ఎక్కడైనా జీవిస్తారు’’.. అని రాశాడు. ఆ కారులో డ్రైవింగ్ నేర్చుకున్న వారు ఎలాంటి ప్రాంతాల్లోనూనా డ్రైవింగ్ చేయొచ్చనేది అతడి ఉద్దేశం.
Marriage Funny Video: ఉంగరం తీస్తున్నారా.. యుద్ధం చేస్తున్నారా.. ఈ వధూవరులు ఏం చేస్తున్నారో చూడండి..
ఇలా వింత కొటేషన్ రాసి అందరినీ ఆకట్టుకుంటున్నాడన్నమాట. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కారు యజమాని తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి వింత కొటేషన్లు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా లైక్‌లు, 2.89 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..