Elephant Viral Video: ఇది కదా ఏనుగు పవర్ అంటే.. దాడి చేయకుండానే ధడ పుట్టించిందిగా..
ABN , Publish Date - Nov 02 , 2025 | 01:57 PM
ఏనుగలు గుంపు ఓ పెద్ద చెట్టు కింద హాయిగా నిద్రపోతున్నాయి. ఇలా హాయిగా రెస్ట్ తీసుకుంటున్న సమయంలో ఓ పెద్ద ఏనుగు అటుగా వచ్చింది. ఏనుగు వచ్చిన చప్పుడు వినపడగానే అక్కడ ఉన్న సింహాలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. నిద్రపోతున్న సింహాలన్నీ పైకి లేచి పారిపోయాయి. చివరగా..
ఏనుగులు అలా నిలబడ్డాయంటే చాలు.. ఎదురుగా ఎలాంటి జంతువున్నా సైడై పోవాల్సిందే. ఒకవేళ ఎదురుగా వస్తే.. ఏనుగు కాలి కింద పడి నలిగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే వాటితో పెట్టుకోవడానికి ఏ జంతువూ సాహసించదు. ఇందుకు నిదర్శనంగా అనేక వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. సింహాల గుంపు ఓ పెద్ద చెట్టు కింద హాయిగా రెస్ట్ తీసుకుంటోంది. ఇంతలో అటుగా ఓ ఏనుగు వచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఏనుగలు గుంపు ఓ పెద్ద చెట్టు కింద హాయిగా నిద్రపోతున్నాయి. ఇలా హాయిగా రెస్ట్ తీసుకుంటున్న సమయంలో ఓ పెద్ద ఏనుగు అటుగా వచ్చింది. ఏనుగు వచ్చిన చప్పుడు వినపడగానే అక్కడ ఉన్న సింహాలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. నిద్రపోతున్న సింహాలన్నీ (Lions run away after seeing an elephant) పైకి లేచి పారిపోయాయి. చివరగా గాఢ నిద్రలో ఉన్న ఓ సింహం.. లేటుగా పైకి లేచింది.
పైకి లేచిన సింహం.. ‘ఏంట్రా అంతా అలా పరుగెడుతున్నారు’.. అన్నట్లుగా పారిపోతున్న తోటి సింహాల వైపు చూస్తుంది. ఆ తర్వాత సౌండ్ విని వెనక్కు తిరిగి ఏనుగును చూసింది. దాన్ని చూడగానే.. ‘ఓరి నాయనో.. ఇదా అసలు విషయం.. కాసేపుంటే దీని చేతిలో చచ్చేదాన్ని కదరా దేవుడా ’.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ అక్కడి నుంచి పారిపోతుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న పర్యాటకులు తమ ఫోన్లలో రికార్డ్ చేశారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఏనుగా మజాకా.. ఈ మాత్రం భయం ఉండాలి మరి’.. అంటూ కొందరు, ‘చివరగా నిద్ర లేచిన సింహం ఎక్స్‌ప్రెషన్ మామూలుగా లేదుగా’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 48 వేలకు పైగా లైక్‌లు, 4 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
లగేజీ చూసి.. అంతా లారీ అని అనుకున్నారు.. చివరకు ముందు వైపు చూసి షాక్ అయ్యారు..
రోడ్డు పక్కన పొదల్లో పడిపోయిన యువతి.. సమీపానికి వెళ్లి చూడగా..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి