West Godavari Youth: దుబాయిలో ఏపీ యువకులకు కష్టాలు.. ఆంధ్రజ్యోతి కథనంతో సహాయం
ABN , Publish Date - Jul 27 , 2025 | 08:16 PM
దుబాయిలో భవనాలకు రంగులు వేసే ఒక సంస్థలో పెయింటర్లుగా పని చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 12మంది పశ్చిమ గోదావరి జిల్లా యువకులు వెళ్లారు. అయితే దుబాయిలో వారు పనిచేసే యజామానితో వివాదం ఏర్పడ్డింది. దీంతో 12మంది యువకులు స్వదేశానికి తిరిగి వచ్చారు.

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: దుబాయిలో (Dubai) భవనాలకు రంగులు వేసే ఒక సంస్థలో పెయింటర్లుగా పని చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 12మంది పశ్చిమ గోదావరి జిల్లా యువకులు (West Godavari Youth) వెళ్లారు. అయితే దుబాయిలో వారు పనిచేసే యజామానితో వివాదం ఏర్పడ్డింది. దీంతో 12మంది యువకులు స్వదేశానికి తిరిగి వచ్చారు. దుబాయిలో తీవ్ర ఎండల్లో వీధులపై ఈ యువకులు ఎదుర్కొంటున్న అవస్థపై ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనానికి స్పందించిన ఆంధ్రప్రదేశ్ ఎన్నార్టీ అధికారులు వీరికి సహాయం చేశారు.
ఏపీ ప్రభుత్వ అధికారులు చేసిన సూచనతో వీరిని దుబాయికు పంపించిన దళారీ వీరిని వెనక్కి రప్పించారు. ఆంధ్రజ్యోతిలో కథనం అనంతరం దుబాయిలోని వాసవీ క్లబ్‌తో పాటు అనేక మంది దాతలు వీరికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. దుబాయిలోని సామాజిక కార్యకర్త తరపట్ల మోహన్, అటు దుబాయి అధికారులు, కంపెనీ యజామాన్యం, ఏపీ ఎన్నార్టీ అధికారులతో సంప్రదింపులు జరిపి వీరిని స్వదేశానికి పంపించడంలో కీలక పాత్ర వహించారు. భీమవరం శ్రీను, గోసంగి ధనలక్ష్మి, బొక్కా కృష్ణ ప్రభాస్, యాండ్ర వెంకట్‌తో పాటు శెట్టిబలిజ సంఘం కూడా దుబాయిలో వీరికి కష్టకాలంలో అపన్న హస్తం అందజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
వైభవంగా సాయి సమాజ్ ఆఫ్ సాగినా తొలి వార్షికోత్సవం
ఖతర్ నుంచి స్వదేశానికి చేరుకున్న తెలుగు పాస్టర్లు