Home » Gulf News
దుబాయిలో భవనాలకు రంగులు వేసే ఒక సంస్థలో పెయింటర్లుగా పని చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 12మంది పశ్చిమ గోదావరి జిల్లా యువకులు వెళ్లారు. అయితే దుబాయిలో వారు పనిచేసే యజామానితో వివాదం ఏర్పడ్డింది. దీంతో 12మంది యువకులు స్వదేశానికి తిరిగి వచ్చారు.
తమ వృత్తుల్లో నైపుణ్యత, ప్రతిభ ఉన్నా సహాజంగా ఉండే మొహమాటం లేదా ఆత్మనూన్యత భావంతో అనేకమంది తెలుగు ప్రవాసీయులు ప్రదర్శించలేకపోతున్నారు. సంభాషణ విధానం అవతలి వ్యక్తిని ప్రభావితం చేస్తోంది, మాట్లాడే మనిషి ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది.
కాంగ్రెస్ పిలుపునిచ్చిన చలో వేల్పూర్ కార్యక్రమం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
స్థానికంగా ఉపాధి దొరకక దేశం కాని దేశాలకు వలసవెళ్తున్న జిల్లా వాసుల పరిస్థితి రోజురోజుకి అక్కడ ఇబ్బందికరంగా మారుతోంది. ఇక్కడ సరైన ఉపాధి లేక, వ్యవసాయం చేసుకునే పరిస్థితులు లేక గల్ఫ్ బాట పడుతున్న జిల్లా వాసులకు ఏజెంట్ల మోసాలు, అక్కడి చట్టాలు ఇబ్బందికరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయి.
ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని దుబాయ్‌కి వెళ్లిన వలస జీవుల కష్టాలు తీరడం లేదు. ఏజెంట్ చేతిలో మోసపోయి స్వదేశానికి తిరిగిరాకపోవడం, ప్రమాదాల్లో గాయపడటం, మరణించడం వంటి ఎన్నో విషాదాలు నేటికి చోటు చేసుకుంటూనే ఉన్నాయి.
దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ వాసుల మృతదేహాలను హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి దుబాయి నుంచి బయలుదేరే ఎయిరిండియా విమానంలో మృతదేహాలను తీసుకురావాలని భావించారు.
దుబాయిలో ఇద్దరు తెలంగాణవాసులను ఒక పాకిస్థానీ దారుణంగా నరికి చంపాడు. మరో ఇద్దరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు! కిందటి శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై దృష్టి సారించింది. గల్ఫ్ వలసలపై అవగాహన కలిగిన సలహా కమిటీని ఏర్పాటు చేస్తూ, ఆమె అమలు కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు
కాలం కన్నెర్రజేస్తే ఓడలు బండ్లయ్యేందుకు.. రాజులు బంట్లయ్యేందుకు ఎంతో సమయం పట్టదు. గల్ఫ్‌లో తెలంగాణకు చెందినఆ ఇద్దరు కుబేరులు రాత్రికి రాత్రే బికారులై కటిక దారిద్య్రం అనుభవించి చనిపోయారు.
గల్ఫ్‌లో స్థిరపడ్డ ఏపీకి చెందిన ఓ హిందూ దంపతులకు ఇద్దరు కూతుళ్ల తర్వాత ఓ బాబు కలిగాడు. అతడి వయసు ప్రస్తుతం ఐదేళ్లు. ఉన్నట్టుండి ఓ పాకిస్థాన్ యువకుడొచ్చి ఆ బాబు తన బిడ్డేనని.. తనకే దక్కాలని ఆ దంపతులతో వాదించాడు.