Telugu Toast Masters Club in Riyadh: రియాధ్‌లో ‘ప్రేరణ’తో ప్రారంభమైన వ్యక్తిత్వ వికాస యాత్ర
ABN , Publish Date - Jul 22 , 2025 | 08:31 PM
తమ వృత్తుల్లో నైపుణ్యత, ప్రతిభ ఉన్నా సహాజంగా ఉండే మొహమాటం లేదా ఆత్మనూన్యత భావంతో అనేకమంది తెలుగు ప్రవాసీయులు ప్రదర్శించలేకపోతున్నారు. సంభాషణ విధానం అవతలి వ్యక్తిని ప్రభావితం చేస్తోంది, మాట్లాడే మనిషి ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది.

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: తమ వృత్తుల్లో నైపుణ్యత, ప్రతిభ ఉన్నా సహాజంగా ఉండే మొహమాటం లేదా ఆత్మనూన్యత భావంతో అనేకమంది తెలుగు ప్రవాసీయులు ప్రదర్శించలేకపోతున్నారు. సంభాషణ విధానం అవతలి వ్యక్తిని ప్రభావితం చేస్తోంది, మాట్లాడే మనిషి ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. బహుళ జాతుల సహాచరుల మధ్య పోటీ వాతావరణం ఉండే గల్ఫ్ దేశాల్లో సహాజంగా ఇది ప్రవాసీయులు తాము ఉద్యోగాలు చేస్తున్న ప్రదేశాల్లో తమ ప్రతిభాపాటవాలు ప్రదర్శించడానికి దోహదం చేయడంతో పాటు తమ వ్యక్తిత్వ వికాసానికి కూడా ఉపకరిస్తోంది.
తెలుగు ప్రవాసీయులకు ఈ దిశగా సహాయం చేసేందుకు ‘ప్రేరణ’ టోస్ట్ మాస్టర్స్ క్లబ్ (Telugu Toast Masters Club in Riyadh) అవిర్భవించింది. రియాధ్‌లోని ప్రముఖ తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా-సెంట్రల్ (SATA Central) నెలకొల్పిన ఈ సంఘం దేశంలోని తెలుగు ప్రవాసీయుల్లో ఆంగ్లం, తెలుగు భాషాల్లో అనర్గళంగా మాట్లాడటమే కాకుండా అందరి ముందు ఆత్మస్థైర్యంతో మాట్లాడే మెలకువలు నేర్పించడానికి కృషి చేస్తోంది. సమంజసమైన వ్యక్తీకరణ మనిషి వికాసానికి దోహాదపడుతోందని ప్రేరణ టోస్ట్ మాస్టర్స్ క్లబ్‌కు అధ్యక్షుడిగా ఎన్నికైన లోకే ప్రశాంత్ తెలిపారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో స్త్రీ, పురుషులకు తర్ఫీదు ఇవ్వడానికి తమ టోస్ట్ మాస్టర్స్ క్లబ్ కృత నిశ్చయంతో ఉందని ఆయన పేర్కొన్నారు.
క్లబ్‌కు ఉపాధ్యక్షులుగా మచిలీపట్నానికి చెందిన మమత, తెనాలికి చెందిన యాకుబ్ ఖాన్, హైదరాబాద్‌కి చెందిన శివారెడ్డి, కోశాధికారిగా కాకినాడకి చెందిన సత్తిబాబు ఎన్నికయ్యారు. రియాధ్‌లో జరిగిన ఈ టోస్ట్ మాస్టర్స్ క్లబ్ కార్యక్రమానికి టోస్ట్ మాస్టర్స్ క్లబ్ డిస్ట్రిక్ డైరెక్టర్ మహమ్మద్ అఫ్జల్ సాహెర్, శేఖర్ తివారీ, నర్సింహారావు రాంపల్లి (డిస్ట్రిక్ 79 గ్రోత్), అలెక్స్ (డిస్ట్రిక్ 79), ఫహాద్ అబూ అహ్మద్, సునీల్ ఇడికుల్లా, తాజ్ టోస్ట్ మాస్టర్స్ క్లబ్ పక్షాన భాస్కర్ ఇలన్గోవన్, నీతూ రతీష్, ప్రముఖ తెలుగు టోస్ట్ మాస్టర్ మోబీన్, సాదిఖ్, సుచరిత, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. సాటా సెంట్రల్ అధ్యక్షుడు జి. ఆనందరాజు, నాయకులు ముజ్జమ్మీల్ శేఖ్, తెలుగు ప్రముఖులు అనిల్, గోవిందరాజు తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు. ఆసక్తి కలిగిన వారు ప్రశాంత్ (0551547324) లేదా యాకుబ్ ఖాన్‌లతో (05001246353) ఈ నెంబర్లలో సంప్రదించవచ్చు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రముఖ ఎన్నారై వైద్యుడు డా. పొలిచెర్ల హరనాథ్‌కు పౌర సన్మానం
డల్లాస్‌లో ఎన్నారై టీడీపీ ఆత్మీయ సమావేశం.. పాల్గొన్న ఎమ్మెల్యే అరవిందబాబు