Home » NRI Latest News
శాన్ జోస్‌లో ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్‌ను అమెరికాలో భారత రాయబారి (అంబాసిడర్ ఆఫ్ ఇండియా ఇన్ యూఎస్ఏ) వినయ్ క్వాత్రా వర్చువల్‌గా ప్రారంభించారు.
హైదరాబాద్‌లో కాన్సుల్ జనరల్‌గా త్వరలో బాధ్యతలు చేపట్టనున్న అమెరికా అధికారి లారా విలియమ్స్ గౌరవార్థం అమెరికాలో భారత సంతతి ప్రముఖులు ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. భారత్, అమెరికాల మధ్య దౌత్య బంధం బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా లారా విలియమ్స్ హామీ ఇచ్చారు.
తానా పాఠశాల ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో ప్రముఖ కవి, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డా. సి. నారాయణ రెడ్డి 94వ జయంతి వేడుక వైభంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు సినారె రచనల విశిష్ఠతను ప్రశంసించారు.
చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన నేరంపై అమెరికాలో భారత సంతతి పైలట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విమానం ల్యాండవగానే అతడిని అరెస్టు చేశారు. నిందితుడు డెల్టా ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్నాడు.
సెప్టెంబర్ 2 నుంచి అమెరికా వీసా ఇంటర్వ్యూ వైవర్ విధానం రద్దు కానుంది. దీంతో, వీసా రెన్యూవల్ మరింత కఠినంగా మారే అవకాశం ఉందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. హెచ్-1బీ వీసాదారులు, వారి కుటుంబసభ్యులకు ఇక్కట్లు ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది.
దుబాయిలో ఓ వెలుగు వెలిగిన కడప జిల్లా వాసి పరిస్థితులు అనుకూలించక తీవ్ర కష్టాల్లో కూరుకుపోయారు. ఒత్తిడి పెరిగి పక్షవాతానికి గురై చివరకు ఆసుపత్రిలో మంచానికి పరిమితమై కన్నీరుమున్నీరవుతున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. సింగపూరియన్స్ తోపాటు, ముఖ్యంగా ప్రవాసాంధ్రులలో పెద్దఎత్తున ఆసక్తి కనిపిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే పెద్ద ఎత్తున అప్లికేషన్లు రావడంతో ఈ భేటీలో పాల్గొనేందుకు చేపట్టిన నమోదు ప్రక్రియ ఆపాలని..
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం , టాంటెక్స్ 'నెల నెలా తెలుగువెన్నెల', తెలుగు సాహిత్య వేదిక 18వ వార్షికోత్సవం 2025 జులై నెల 19 వ తేదీన డాలస్ పురము నందు ఘనంగా నిర్వహించారు.
ఆషాఢ మాసం సందర్భంగా వర్జీనియాలో తానా ఆధ్వర్యంలో తెలుగు ఆడపడుచుల గోరింటాకు పండుగ ఘనంగా నిర్వహించారు.
తమ వృత్తుల్లో నైపుణ్యత, ప్రతిభ ఉన్నా సహాజంగా ఉండే మొహమాటం లేదా ఆత్మనూన్యత భావంతో అనేకమంది తెలుగు ప్రవాసీయులు ప్రదర్శించలేకపోతున్నారు. సంభాషణ విధానం అవతలి వ్యక్తిని ప్రభావితం చేస్తోంది, మాట్లాడే మనిషి ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది.