PM Modi At Paris AI Summit : మానవాళికి దిశానిర్దేశం చేసేందుకు ఏఐ అవసరం.. ఫ్రాన్స్ ఏఐ సమ్మిట్‌లో ప్రధాని మోదీ..
ABN , Publish Date - Feb 11 , 2025 | 04:08 PM
PM Modi At Paris AI Summit : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు. ఇవాళ పారిస్‌లో జరుగుతున్న ఏఐ శిఖరాగ్ర సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుల్ మెక్రాన్‍లో కలిసి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్‌లో కృత్రిమ మేధ వల్ల ప్రపంచానికి కలిగే ప్రయోజనాలు, అనర్థాలపై పలు విషయాలు మాట్లాడారు.

PM Modi At Paris AI Summit: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు. ఇవాళ పారిస్‌లో జరుగుతున్న ఏఐ శిఖరాగ్ర సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుల్ మెక్రాన్‍లో కలిసి ప్రధాని మోదీ అధ్యక్షత వహించిన ఆయన..ఈ సమావేశంలో పలు విషయాల గురించి ప్రసంగించారు. మానవుల దైనందిన జీవితాల్లో కృత్రిమ మేధస్సు ఎలా కీలక పాత్ర పోషిస్తుందనే దాని గురించి విస్తృతంగా చర్చించారు. AI ప్రయోజనాలను అందరితో పంచుకోవాలని చెబుతూనే.. కృత్రిమ మేధస్సు పక్షపాతం చూపించే గురించి కూడా హెచ్చరించారు.
ఏఐ యుగం ప్రారంభంలో ఉన్నాం: మోదీ
పారిస్‌లో జరిగిన AI యాక్షన్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ, "మానవజాతి దిశను నిర్దేశించే AI యుగం ప్రారంభంలో మనం ఉన్నాం" అని అన్నారు. భారతదేశం తన వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తనదైన భాషా ప్రధాన ఏఐ నమూనాను సృష్టిస్తోందని ఈ సందర్భంగా వెల్లడించారు. కంప్యూటింగ్ వనరులను సమీకరించడానికి ఇండియాకు ఒక ప్రత్యేకమైన ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య నమూనా ఉందని.. దీనిని స్టార్టప్‌లు, పరిశోధకులకు సరసమైన ధరకు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. భవిష్యత్తులో AI టెక్నాలజీ రూపకల్పనలోని అనుభవాలను, నైపుణ్యాలకు భారతదేశం ఇతర దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
పక్షపాతం లేని ఏఐని అభివృద్ధి చేద్దాం: మోదీ
"మనమంతా మన వనరులను, ప్రతిభను ఒకచోట చేర్చుకోవాలని ప్రధాని మోదీ ఏఐ సమ్మిట్‌లో వెల్లడించారు. నమ్మకమైన, పారదర్శకతను పెంపొందించే ఓపెన్ సోర్స్ వ్యవస్థలను అభివృద్ధి చేయాలని.. పక్షపాతం లేని నాణ్యమైన డేటాసెట్‌లను అభివృద్ధి చేసి ప్రపంచానికి ప్రయోజనం చేకూర్చాలని అన్నారు. AI అనేది ప్రజలే కేంద్రీకృతంగా పని చేసేలా ఉండాలి. సైబర్ భద్రత, తప్పుడు సమాచారం, నకిలీలకు సంబంధించిన ఆందోళనలను మనమే పరిష్కరించాలి" అని తెలిపారు.
లక్షలాది జీవితాలను మార్చేది ఏఐ: మోదీ
ప్రధానమంత్రి మోదీ AI లక్షలాది మంది జీవితాలను మార్చడానికి ఎలా సహాయపడుతుందో ఏఐ శిఖరాగ్ర సదస్సులో వివరంగా చెప్పారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం ఇలా మరిన్ని రంగాలకు కృత్రిమ మేధ విస్తరణ చేయవచ్చని ఆయన అన్నారు. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సులభంగా, వేగంగా చేరుకునే ప్రపంచాన్ని సృష్టించడంలో కూడా AI తప్పక సహాయపడుతుందని ఉద్ఘాటించారు.
ఇవి కూడా చదవండి..
Narendra Modi: భారత్ ఇంధన పరివర్తన.. ప్రపంచ గేమ్ ఛేంజర్
Mahakumbh 2025: రేపటి నుంచి మహా కుంభమేళాలో.. ఈ సమయాల్లో నో వెహికల్ జోన్ రూల్.. రూట్ మ్యాప్ విడుదల..
Gujarat Titans: కొత్త ఓనర్ చేతికి గుజరాత్ టైటాన్స్.. ఇక అతడిదే హవా
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..