Share News

Bengaluru: ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ.. 31 మంది అరెస్టు..

ABN , Publish Date - May 26 , 2025 | 11:14 AM

Bengaluru Rave Party Bust: బెంగళూరు సమీపంలోని ఫాంహౌస్‌లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. 20 మంది యువకులు, 7 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో చైనా మహిళ కూడా ఉంది.

Bengaluru: ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ.. 31 మంది అరెస్టు..
Chinese and IT professionals Arrested In Bengaluru Rave Party

Chinese and IT professionals Arrested In Rave Party: బెంగళూరు గ్రామీణ జిల్లా దేవనహళ్లి తాలూకాలో జరుగుతున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. కన్నమంగళ గేట్ సమీపంలోని ఒక ఫామ్‌హౌస్‌లో పార్టీ జరుగుతోందని సమాచారం రావడంతో దేవనహళ్లి పోలీసులు ఉదయం 5 గంటలకు దాడి చేశారు. ఈ దాడిలో కొకైన్, హైడ్రో, గంజాయి వంటి నిషేధిత మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీలో పాల్గొన్న మొత్తం 31 మంది యువతీ యువకులను అరెస్టు చేశారు. వీరిలో దాదాపు 20 మంది యువకులు, 10 మంది యువతులు అత్యధికంగా ఐటీ ఉద్యోగులే ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పుట్టినరోజు వేడుకల కోసం నిర్వహించిన ఈ రేవ్ పార్టీలో 7 మంది చైనా మహిళలు కూడా పాల్గొన్నారు.


కన్నమంగళ గేట్ సమీపంలోని ఫామ్‌హౌస్‌లో ఆదివారం రేవ్ పార్టీ జరుగుతున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో దేవనహళ్లి ఏసీపీ నవీన్ నేతృత్వంలోని పోలీసు బృందం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుంది. పార్టీకి హాజరైన యువతీ యువకులను అదుపులోకి తీసుకుంది. దాడిలో 24 మంది యువకులు, 7 మంది యువతులు సహా మొత్తం 31 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో అత్యధికులు ఐటీ ఉద్యోగులు కాగా, ఒక చైనా మహిళ కూడా ఉంది. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఈ పార్టీ నిర్వహించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.


పార్టీకి హాజరైన కొంతమంది వద్ద మాదకద్రవ్యాలు లభ్యమయ్యాయి. వాటిలో హైడ్రో డ్రగ్స్, గంజాయితో పాటు కొద్ది మొత్తంలో కొకైన్ కూడా ఉంది. వాటిని స్వాధీనం చేసుకుని NDPS చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అరెస్టు అయినవారిలో మాదకద్రవ్యాల వినియోగదారులతో పాటు సరఫరాదారులు ఇద్దరూ ఉన్నారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్ ఈస్ట్ జోన్) వీజే సజీత్ పీటీఐకి తెలిపారు. కస్టడీలోకి తీసుకున్న నిందితుల రక్తం, మూత్ర నమూనాలను సేకరించారు. విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL)కి పంపారు. నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటారు. మరింత సమాచారం కోసం నిందితులను ప్రశ్నిస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.


ఎయిర్‌పోర్టుకు అత్యంత సమీపంలోనే ఉన్న ఫాంహౌస్‌లో రేవ్‌ పార్టీ జరగడం చర్చనీయాంశంగా మారింది. పార్టీలో పాల్గొన్నవారంతా బడాబాబులేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. అమ్మాయిలను పిలిపించి అశ్లీల నృత్యాలు వేయించడంతో పాటు, మద్యం, నిషేధిత డ్రగ్స్ తో జల్సా చేసినట్లు సమాచారం. పార్టీకి హాజరైన 31 మందితో పాటు అక్కడ పెద్దసంఖ్యలో ఉన్న కార్లు, బైక్‌లు, మొబైళ్లు తదితరాలను కూడా పోలీసులు సీజ్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దారుణం.. తొమ్మిది మంది అన్నాచెల్లెళ్లు మృతి..

అతడికి ఏదో అయ్యింది.. పిచ్చివాడిగా మారాడు..

For National News And Telugu News

Updated Date - May 26 , 2025 | 11:56 AM