Home » Arrest
గౌతమ్ గంభీర్‌ను చంపేస్తానంటూ బెదిరించిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గౌతమ్ గంభీర్‌ను చంపేస్తానంటూ బెదిరించిన ఇంజినీరింగ్ విద్యార్థిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. గౌతమ్ గంభీర్‌కు బెదిరింపు మెయిల్స్ పంపిన గుజరాత్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి జిగ్నేశ్ సిన్హ్ పర్మార్ (21)గా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.
ఒక మహిళ వద్ద పూజలు చేస్తానని చెప్పి అఘోరి రూ. 10 లక్షలు తీసుకుంది. మోసపోయినట్లు గ్రహించిన బాధిత మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.
మీ వీడియో నా దగ్గరుంది.. అది బయటపెట్టకుండా ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వండి.. అంటూ ఓ ఎమ్మెల్యేను యూట్యూబ్ చానల్ రిపోర్టర్ బ్లాక్మెయిల్ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన వారు అతడిని అరెస్టు చేశారు.
మహిళా సినీ నిర్మాతను మోసగించిన కేసులో అఘోరీని అరెస్టు చేసిన పోలీసులు, లింగనిర్ధారణ పరీక్ష అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. అతని భార్య శ్రీవర్షిని కస్తూర్బా గాంధీ హోంకు తరలించి, అఘోరీ జైలులో ఉంటాడని పేర్కొన్నాడు
లేడీ అఘోరీ అలియాస్ శివ విష్ణు బ్రహ్మ అల్లూరి శ్రీనివా్‌సను మోకిల పోలీసులు అరెస్టు చేశారు. పూజల పేరిట ఓ మహిళను రూ.9.80 లక్షల మేర మోసం చేసిందనే ఆరోపణలపై నమోదైన కేసులో పోలీసులు చర్యలు తీసుకున్నారు.
వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆమెను గురజాలలో జడ్జి ఎదుట హజరు పరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విదిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆమెను గుంటూరు జైలుకు తరలించారు.
ఈ ఘటనతో ప్రమేయమున్నట్టు భావిస్తున్న తొమ్మది మందిని ఇప్పటి వరకూ అరెస్టు చేసినట్టు గుణ పోలీస్ సూపరింటెండెంట్ సంజీవ్ కుమార్ షిండే తెలిపారు. ఘటనలో ప్రధాన నిందితుడు విక్కీ పఠాన్‌ను సైతం పోలీసులు అరెస్టు చేశారు.
గత కొద్దిరోజులుగా నగరంలో కోట్లాది రూపాయలను కొల్లగిట్టిన సైబర్ నేరగాళ్లలో ఒకరిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. మొత్తం రూ.2.01 కోట్లు కొల్లగొట్టిన ఆ సైబర్ నేరగాడిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.
కారు పార్కింగ్ విషయంలో బిగ్‌బాస్ ఫేమ్, నటుడు దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైకోర్టు న్యాయమూర్తి కుమారుడు, ఆయన భార్య, అత్తతో దర్శన్ గొడవకు దిగి వారిపై దాడికి పాల్పడ్డాడని అందిన ఫిర్యాదుతో పోలీసులు దర్శన్‌ను అరెస్ట్ చేశారు.
అరెస్టుల సమయంలో పోలీసులు హద్దులు దాటొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిందితుల హక్కులను గౌరవించాల్సిన బాధ్యత డీజీపీలదని తెలిపింది