Share News

Hyderabad: రుణాల పేరుతో ‘రియల్‌’ మోసం..

ABN , Publish Date - May 21 , 2025 | 10:18 AM

హైదరాబాద్ నగరంలో మరో కొత్తరకం మోసం వెలుగులోకి వచ్చింది. ఆస్తులు తనాఖా పెట్టించి బ్యాంకు రుణాలు ఇప్పిస్తామంటూ నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: రుణాల పేరుతో ‘రియల్‌’ మోసం..

- ముఠా ఆటకట్టించిన సీసీఎస్‌ పోలీసులు

- ముగ్గురు నిందితుల అరెస్టు

హైదరాబాద్‌ సిటీ: ఆస్తులు తనాఖా పెట్టించి బ్యాంకు రుణాలు ఇప్పిస్తామంటూ నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. సీసీఎస్‌ డీసీపీ శ్వేత తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రకు చెందిన జబ్బర్‌ఖాన్‌ మున్షీఖాన్‌, ఖురేషీ జావెద్‌ హబీబ్సాబ్‌, సద్దాం హబీబ్‌సాబ్‌ ఖురేషీ కొన్నాళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి బేగంపేట ప్రకా్‌షనగర్‌లో స్థిరపడ్డారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: నాలుగేళ్లుగా చెట్టుకిందే అమ్మవార్లు..


వివిధ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సోమాజిగూడ(Somajiguda)లో జేకే ఎంటర్‌ప్రైజెస్‌ (ఫైనాన్స్‌ సొల్యూషన్స్‌) పేరుతో రియల్‌ ఎస్టేట్‌ బ్రోకరేజ్‌ వ్యాపారాన్ని ప్రారంభించారు. ముగ్గురూ ఒక ముఠాగా ఏర్పడ్డారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో పరిచయాలు పెంచుకొని, వారి ద్వారా మార్టిగేజ్‌ రుణాలు ఇప్పిస్తామని స్థానికులను, తెలిసిన వారిని నమ్మించేవారు.


city5.2.jpg

రుణాల కోసం వచ్చిన వారి నుంచి స్థలం పత్రాలు, ఇతర ఐడీ ప్రూఫ్‌లు తీసుకునే వారు. వారికి అవసరమైన రుణం ఇచ్చేందుకు సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉందని నమ్మించేవారని డీసీపీ తెలిపారు. తర్వాత డబ్బులు, చెక్కులు తీసుకునే వారు. కస్టమర్ల బ్యాంకు ఖాతాలో డబ్బు అయిన వెంటనే చెక్కుల ద్వారా ఆ డబ్బును కాజేస్తున్నారు. ఇలా పలువురిని మోసం చేసిన ఈ ముఠాను ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి పర్యవేక్షణలో అరెస్ట్‌ చేసినట్లు సీసీఎస్‌ డీసీపీ శ్వేత తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి.

Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

నల్లమల సంపదపై రేవంత్‌ కన్ను: బీఆర్‌ఎస్‌

BSF Jawan: దేశసేవకు వెళ్లి.. విగతజీవిగా ఇంటికి..

Adilabad MP Nagesh: పటాన్‌చెరు- ఆదిలాబాద్‌ రైల్వే లైన్‌ నిర్మాణ పనులు చేపట్టాలి

గోవుల అక్రమ రవాణా

Read Latest Telangana News and National News

Updated Date - May 21 , 2025 | 10:18 AM