Hyderabad: మూడు కంపెనీల పేరుతో.. మొత్తం రూ.4.48 కోట్లు..
ABN , Publish Date - May 23 , 2025 | 01:54 PM
మూడు కంపెనీల పేరుతో.. మొత్తం రూ.4.48 కోట్ల మోసానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్‌లోని బొల్లారం ప్రాంతానికి చెందిన జితేంద్రకుమార్ చౌబే అనే వ్యక్తి ఈ మోసాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

- ఆర్థిక మోసానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్ సిటీ: కంపెనీలను చూపించి ఆర్థిక మోసాలకు పాల్పడిన వ్యక్తిని సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసుల అరెస్టు చేశారు. డీసీపీ కె.ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం సికింద్రాబాద్‌లోని బొల్లారం ప్రాంతానికి చెందిన జితేంద్రకుమార్ చౌబే పదవీ విరమణ తర్వాత అల్వాల్‌లో జె.కె. ఎంటర్‌పైజ్రెస్, సౌమ్య శ్రీ హాస్పిటల్, కార్తీక్ లాజిస్టిక్స్‌ను ప్రారంభించాడు. ఈ కంపెనీలను చూపుతూ డిపాజిట్ చేసిన వారికి నెలకు 5 శాతం లాభాలు ఇస్తూ వచ్చాడు. పరిచయస్తులు, రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది అతన్ని నమ్మి పెద్దమొత్తంలో డబ్బు డిపాజిట్ చేశారు.
కొందరు రూ.2లక్షల వరకు డిపాజిట్ చేశారు. ఇలా అందరి నుంచి కలిపి మొత్తం రూ.4.48 కోట్లను ఆయా కంపెనీల పేర్ల మీద డిపాజిట్లుగా సేకరించాడు. కొన్ని నెలల పాటు చెల్లింపులు చేసి, ఆ తర్వాత మానేశాడు. 2024 డిసెంబర్ లో కంపెనీలను మూసివేసి పరారయ్యాడు. బాధితులు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు. ఈనెల 21ర ఢిల్లీలో జితేంద్రకుమార్ చౌబేను అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చినట్లు డీసీపీ తెలిపారు. కేసును సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం డిప్యూటీ కమిషనర్ కె. ప్రసాద్ పర్యవేక్షణలో అసిస్టెంట్ కమిషనర్ ఎస్. మురళీకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
బాబోయ్ మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..
సీఎం ఓఎస్‌డీని అంటూ మెయిల్స్, కాల్స్
Read Latest Telangana News and National News