Share News

Kashmir: కశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులకు స్కెచ్.. 48 టూరిస్ట్ స్పాట్స్ మూసివేత..

ABN , Publish Date - Apr 29 , 2025 | 02:42 PM

Kashmir Tourist Sites Closed: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ కఠిన చర్యలు చేపడుతుండటంతో ఉగ్రవాదులు మరిన్ని దాడులకు ప్లాన్ చేస్తున్నారని నిఘా వర్గాలు భద్రతా హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో 48 పర్యాటక ప్రాంతాలను మూసివేశారు.

Kashmir: కశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులకు స్కెచ్.. 48 టూరిస్ట్ స్పాట్స్ మూసివేత..
Kashmir Tourist Sites Closed After Pahalgam Attack

Kashmir Terror Attack 2025: పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి(Pahalgam Terror Attack)లో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఈ విషాదం తర్వాత భారత ఆర్మీ వరసగా టెర్రరిస్టుల ఇళ్లు ధ్వంసం చేస్తుడటంతో ఉగ్రవాదులు ఎదురుదాడులకు దిగేందుకు స్కెచ్ వేస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం. దాడి తర్వాత కూడా కొందరు పర్యాటకులు కశ్మీర్ కు వెళ్తుండటంతో భద్రతా కారణాల దృష్ట్యా డజన్ల కొద్దీ రిసార్టులు, సగానికిపైగా పర్యాటక ప్రాంతాలను క్లోజ్ చేసింది.


కశ్మీర్‌లో 87 పబ్లిక్ పార్కులు, తోటలలో 48 టూరిస్ట్ స్పాట్లు మూతపడ్డాయి. మూసివేసిన ప్రదేశాలలో దూష్‌పత్రి, కోకర్నాగ్, దుక్సమ్, సింథాన్ టాప్, అచ్చబల్, బాంగస్ వ్యాలీ, మార్గన్ టాప్, తోసామైదాన్ వంటి ప్రసిద్ధ, అభివృద్ధి చెందుతున్న పర్యాటక ప్రదేశాలు రెండూ ఉన్నాయి. ఈ ప్రాంతాలు పర్యాటకులకు ముప్పు కావచ్చని నిఘా వర్గాలు హెచ్చరించడమే కారణం. అదీగాక పహల్గాం దాడిలో కూడా పర్యాటకులనే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించిన సంగతి తెలిసిందే.


పహల్గాం దాడి తర్వాత అణ్వాయుధ పొరుగు దేశాలైన భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ ఒకదానికొకటి వ్యతిరేకంగా అనేక చర్యలు తీసుకున్నాయి. భారత్ సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. అయినప్పటికీ సరిహద్దుల వద్ద పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు తెగబడుతూనే ఉంది. ఏప్రిల్ 28-29 రాత్రి నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి ఎటువంటి కవ్వింపు లేకుండా అఖ్నూర్ సెక్టార్‌ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపింది. అయితే, దాయాది సైన్యం రెచ్చగొట్టే చర్యలకు భారత సైన్యం కూడా ధీటుగా స్పందిస్తోంది.


Read Also: Viral News: పాకిస్తాన్‎ను 4 ముక్కలు చేయాలి..ఇలా చేస్తేనే వారికి మేలు..

Stalin: రాష్ట్రంలో మత ఉగ్రవాదాన్ని సహించబోం..

Hashim Musa Ex Pakistan Army Commando: పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాది ఓ మాజీ పాక్ పారా కమాండో!

Updated Date - Apr 29 , 2025 | 02:45 PM