-
-
Home » Mukhyaamshalu » August 1 Friday 2025 Live Updates Top news Breaking News and Major Events Across India abn andhrajyothy kjr
-

BREAKING: అనిల్ అంబానీపై లుకౌట్ సర్క్యులర్ జారీ
ABN , First Publish Date - Aug 01 , 2025 | 07:25 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
Aug 01, 2025 21:13 IST
జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు 7 అవార్డులు
ఉత్తమ చిత్రంగా బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి'
బేబీ, హనుమాన్ చిత్రాలకు రెండేసి అవార్డులు
'బలగం'తో గీత రచయిత కాసర్ల శ్యామ్‌కు జాతీయ అవార్డు
'గాంధీ తాత చెట్టు' సినిమాతో ఉత్తమ బాలనటిగా దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి
-
Aug 01, 2025 21:13 IST
లండన్ టెస్టు మ్యాచ్..
లండన్ టెస్టు: టీ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ 215/7
భారత్‌పై తొలి ఇన్నింగ్స్ 9 పరుగుల వెనుకంజలో ఇంగ్లండ్
-
Aug 01, 2025 21:13 IST
ఢిల్లీలో సీఎం రేవంత్ పర్యటన
రేపు AICC ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం రేవంత్
'రాజ్యాంగ సవాళ్లు - మార్గాలు, దృక్పథాలు'పై కార్యక్రమం
హాజరుకానున్న ఖర్గే, రాహుల్, కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు
-
Aug 01, 2025 20:09 IST
అనిల్ అంబానీపై లుకౌట్ సర్క్యులర్ జారీ
రుణాలు తీసుకుని బ్యాంకులను మోసం చేయడంతో పాటు..
మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని అనిల్ అంబానీపై ఆరోపణలు
ఈనెల 5న విచారణకు రావాలని ఇప్పటికే అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు
-
Aug 01, 2025 18:20 IST
71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన
2023 ఏడాదికి జాతీయ చలనచిత్ర అవార్డులు
15 విభాగాల్లో అవార్డులు ప్రకటించిన జ్యూరీ
బెస్ట్ స్క్రిప్ట్: సన్‌ఫ్లవర్స్(కన్నడ)కు జ్యూరీ అవార్డు
బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ - ద ఫస్ట్ ఫిల్మ్(హిందీ)
బెస్ట్ సినిమాటోగ్రఫీ - లిటిల్ వింగ్స్(తమిళ్)
బెస్ట్ నాన్ ఫీచర్ సినిమా - క్రానికల్ ఆఫ్ ది ప్యాడీ మ్యాన్(మలయాళం)
బెస్ట్ నాన్ ఫీచర్ సినిమా: నెకల్(మలయాళం)
బెస్ట్ నాన్ ఫీచర్ సినిమా - ద సీ అండ్ సెవెన్ విలేజస్(ఒడియా)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ - ప్రణీల్ దేశాయ్
బెస్ట్ షార్ట్ ఫిల్మ్ - గిధ్ ది స్కావెంజర్(హిందీ)
ఉత్తమ కథా రచయిత - చిదానంద నాయక్(కన్నడ)
-
Aug 01, 2025 18:08 IST
కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించిన అధికారులు
డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి సమక్షంలో సీఎంకు నివేదిక సమర్పణ
నివేదికను అధ్యయనం చేసి సమగ్ర సమాచారం తయారీకి కమిటీని నియమించిన ప్రభుత్వం
నీటిపారుదల శాఖ సెక్రటరీ, న్యాయశాఖ సెక్రటరీ, జీఏడీ సెక్రటరీ సభ్యులుగా కమిటీ
నివేదిక అధ్యయనం చేసి సారాంశం ఈ నెల 4న రాష్ట్ర కేబినెట్‌కు సమర్పించనున్న కమిటీ
-
Aug 01, 2025 18:07 IST
వ్యాపారవేత్త అనిల్ అంబానీకి ఈడీ సమన్లు
బ్యాంక్ రుణాల మోసం కేసులో ఈనెల 5న విచారణకు రావాలని ఆదేశం
రూ.17 వేల కోట్ల రుణాల మోసం కేసులో ప్రశ్నించనున్న ఈడీ
అనిల్ అంబానీ మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు
-
Aug 01, 2025 18:07 IST
తెలంగాణలో ఆపరేషన్ ముస్కాన్, 7,678 మంది చిన్నారులు రెస్క్యూ
7,149 మంది బాలురు, 529 మంది బాలికలను రక్షించిన పోలీసులు
మధ్యప్రదేశ్, రాజస్థాన్‌కు చెందిన 3,783, నేపాల్‌కు చెందిన నలుగురు గుర్తింపు
6,718, స్ట్రీట్ చిల్డ్రన్స్ 357, బెగ్గింగ్ చేస్తున్న 42 మంది చిన్నారులు గుర్తింపు
ఇప్పటివరకు 1,713 కేసులు నమోదు, 1,718 మంది నిందితులు అరెస్టు
6,593 మంది పిల్లలను వారి కుటుంబాలకు అప్పగించిన పోలీసులు
1,049 మంది చిన్నారులను రెస్క్యూ హోమ్‌కు తరలించిన పోలీసులు
-
Aug 01, 2025 18:07 IST
ఏపీ లిక్కర్ స్కాం కేసులో వెంకటేష్ నాయుడు బెయిల్ పిటిషన్ కొట్టివేత
A-34 వెంకటేష్ బెయిల్ పిటిషన్ కొట్టివేసిన విజయవాడ ACB కోర్టు
విజయవాడ జిల్లా జైలులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న వెంకటేష్
-
Aug 01, 2025 17:08 IST
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గిన కేంద్రం
కేబినెట్ నిర్ణయాన్ని మరోసారి స్పష్టం చేసిన కేంద్రం
రాజ్యసభలో వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం
-
Aug 01, 2025 17:03 IST
అమరావతి: చేనేతలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
నేటి నుంచే ఉచిత విద్యుత్ అమలుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్
నేతన్నల ఉచిత విద్యుత్‌కు రూ.125 కోట్ల వ్యయం
50 వేల మగ్గాలు, 15 వేల మరమగ్గాల కలిగిన కుటుంబాలకు లబ్ధి
-
Aug 01, 2025 17:02 IST
ఓవల్ టెస్టు: తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 224 పరుగులకు ఆలౌట్
ఇవాళ 20 పరుగులు మాత్రమే చేసి చివరి 4 వికెట్లు కోల్పోయిన భారత్
భారత్ బ్యాటింగ్: కరుణ్ 57, సాయిసుదర్శన్ 38, వాషింగ్టన్ సుందర్ 26, గిల్ 21
-
Aug 01, 2025 17:02 IST
ఢిల్లీ: బెట్టింగ్ యాప్స్ అంశాన్ని సుప్రీం సీరియస్‌గా తీసుకుంది: కేఏ పాల్
కేంద్ర, రాష్ట్రాలు, ఈడీ, ట్రాయ్, ఆర్బీఐ, యాప్స్ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చింది
ప్రమోట్ చేసిన వారిలో క్రికెటర్లు, సినీ సెలబ్రిటీలు ఉన్నారు: కేఏ పాల్
యువతను రక్షించేందుకు కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది: కేఏ పాల్
భారత దేశంలోని 30 కోట్ల మంది యువతను కాపాడాలి: కేఏ పాల్
యెమెన్ లో శిక్ష పడిన నిమిష ప్రియ రిలీజ్ కావాలి: కేఏ పాల్
యెమెన్‌లో నిమిష ప్రియను రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నా: కేఏ పాల్
-
Aug 01, 2025 17:02 IST
అమరావతి రాజధానిలో రైతుకూలీల సంబరాలు
రాజధాని రైతు కూలీ పెన్షన్లను మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం
రాజధాని ప్రాంత రైతు కూలీలకు పెన్షన్లు మంజూరు నేపథ్యంలో రైతు కూలీల హర్షం
-
Aug 01, 2025 17:02 IST
కర్ణాటక: కొప్పల్‌లో లోకాయుక్త దాడులు
KRIDL మాజీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ఇంట్లో తనిఖీలు
లోకాయుక్త దాడుల్లో రూ.30 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు
రూ.15 వేలు జీతం తీసుకునే కలకప్పకు ఆదాయానికి మించిన ఆస్తులు
40 ఎకరాల వ్యవసాయ భూమి, 24 ఇళ్లు, 6 ప్లాట్లు, బంగారు ఆభరణాలు గుర్తింపు
-
Aug 01, 2025 15:31 IST
విజయవాడ: ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈనెల 4కు వాయిదా
లిక్కర్ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని సిట్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు
లిక్కర్ కేసులో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ బెయిల్ పిటిషన్లపై విచారణ ఈనెల 5కు వాయిదా
కౌంటర్లు దాఖలు చేసిన సిట్ అధికారులు
-
Aug 01, 2025 15:31 IST
విజయవాడ: లిక్కర్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణ ఈనెల 4కు వాయిదా
ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
కౌంటర్ దాఖలు చేయాలని సిట్ అధికారులకు విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు
కేసులో A35 బాలాజీ యాదవ్, A36 నవీన్‌కృష్ణ బెయిల్ పిటిషన్లు
ఆగస్టు 7వ తేదీకి విచారణ వాయిదా వేసిన విజయవాడ ఏసీబీ కోర్టు
-
Aug 01, 2025 15:30 IST
ఎన్టీఆర్ ఆలోచన నుంచే రాయలసీమకు సాగునీటి ప్రాజెక్టులు: చంద్రబాబు
రూ.3,800 కోట్లతో హంద్రీనీవా పనులు చేపట్టాం: సీఎం చంద్రబాబు
త్వరలోనే హంద్రీనీవా పనులు పూర్తిచేసి చెరువులన్నీ నింపుతాం: చంద్రబాబు
సముద్రంలోకి వెళ్లే నీటిని వాడుకుంటే కరవు అనేదే ఉండదు: చంద్రబాబు
రాయలసీమకు పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది: సీఎం చంద్రబాబు
త్వరలోనే కడప స్టీల్‌ప్లాంట్ నిర్మాణ పనులు: ఏపీ సీఎం చంద్రబాబు
రేపు అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభిస్తున్నాం: సీఎం చంద్రబాబు
ఏపీ రూ.14 వేలు, కేంద్రం రూ.6 వేలు ఇవ్వబోతున్నాయి: సీఎం చంద్రబాబు
మొత్తంగా రైతులకు రూ.20 వేలు ఇవ్వబోతున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు
-
Aug 01, 2025 15:30 IST
కడప: గూడెంచెరువులో సీఎం చంద్రబాబు ప్రజావేదిక బహిరంగసభ
ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై అసభ్యంగా మాట్లాడిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని జగన్ పరామర్శించారు: చంద్రబాబు
పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే కట్టడి చేయాలి.. ఖండించాలి: చంద్రబాబు
నల్లపురెడ్డిని మందలించాల్సిందిపోయి ప్రోత్సహిస్తున్నారు: చంద్రబాబు
మహిళలపై ఇంకా ఆంబోతులా విరుచుకుపడు అన్నట్లుంది జగన్ వైఖరి: చంద్రబాబు
నాయకుడే రెచ్చగొడితే కిందిస్థాయి నేతలు ఇష్టానుసారం మాట్లాడతారు: చంద్రబాబు
ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అవసరమా?: సీఎం చంద్రబాబు
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే తోక కట్‌చేస్తా: సీఎం చంద్రబాబు
బంగారుపాళ్యం పర్యటన దృశ్యాలను నెల్లూరులో వచ్చినట్లు చూపించారు
వితండవాదం చేయడంలో వైసీపీ ఎప్పుడూ ముందుంటుంది: చంద్రబాబు
ప్రతిచోటా డ్రోన్లు పర్యవేక్షిస్తున్నాయి.. తస్మాత్ జాగ్రత్త: సీఎం చంద్రబాబు
-
Aug 01, 2025 12:59 IST
ఉప రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల
ఉప రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
సెప్టెంబర్ 9న ఎన్నిక
ఉప రాష్ట్రపతిని ఎన్నుకోనున్న ఉభయ సభల ఎంపీలు
ఆగస్టు 7న నోటిఫికేషన్ విడుదల
ఆగస్టు 21 నామినేషన్ల దాఖలకు చివరి తేదీ
ఆగస్టు 22 నామినేషన్ల పరిశీలన
ఆగస్టు 25 నామినేషన్లు ఉపసంహరణ
సెప్టెంబర్ 9న ఉదయం పది నుంచి ఐదు గంటల వరకు పోలింగ్
సెప్టెంబర్ 9న పోలింగ్ ముగిసిన తర్వాత కౌంటింగ్
-
Aug 01, 2025 12:36 IST
ఆ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
ఏపీలో కానిస్టేబుల్, హోం గార్డ్ నియామకాల నోటిఫికేషన్‌పై దాఖలైన పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను అదే హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసిందన్న ఏపీ ప్రభుత్వం.
ఈ ఏడాది జూన్‌లో మొదలైన ఎంపిక ప్రక్రియ.. ఈరోజుతో ముగిసినట్లు కోర్టుకు చెప్పిన ప్రభుత్వం.
ఈరోజు ఉదయం ఫలితాలు విడుదల చేసినట్లు చెప్పిన కేంద్రం.
హోమ్‌గార్డు ఎంపిక ప్రక్రియపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన పలువురు అభ్యర్థులు.
అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ బాలచంద్ర వరాలే ధర్మాసనం.
ఈరోజు పోలీసు రిక్రూట్మెంట్ ఫలితాలు కూడా ప్రకటించిన నేపథ్యంలో ఈ విషయంలో జోక్యం చేసుకోవడం లేదని స్పష్టం చేసిన ధర్మాసనం.
-
Aug 01, 2025 12:18 IST
ఎసీబీ కోర్టుకు 12 మంది నిందితులు
మద్యం కుంభకోణం కేసులో 12 మంది నిందితులను ఎసీబీ కోర్టులో హాజరుపరచిన సిట్ అధికారులు
కోర్టు ఆదేశాల ప్రకారం జైల్లో వసతులు కల్పించలేదని న్యాయాధికారికి చెప్పిన ఎంపీ మిథున్ రెడ్డి
ఈకేసును రాజకీయ కారణాలతో నాపై మోపారు..
ఉద్దేశపూర్వకంగా నాకు జైల్లో సౌకర్యం కల్పించకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపణలు.
నిబంధనల ప్రకారం వసతులు కల్పించామన్న పీపీ
-
Aug 01, 2025 10:31 IST
సృష్టి ఫెర్టిలిటీ భవనంలో క్షుద్ర పూజల కలకలం
విశాఖ సృష్టి ఫెర్టిలిటీ భవనంలో క్షుద్ర పూజలు కలకలం.
నిర్మాణ దశలో ఉన్న భవనంలో పూజలు చేసినట్టు గుర్తింపు.
భవనం మొదటి అంతస్తులో హోమం జరిగినట్లు ఆధారాలు.
ఈ పూజలు ఎవరు చేశారనే కోణంలో పోలీసుల విచారణ
-
Aug 01, 2025 10:25 IST
ఫైనల్స్‌కి 33921 మంది అర్హత
2022లో నోటిఫికేషన్ ఇచ్చిన కానిస్టేబుల్ పోస్టుల ఫలితాలు ఇప్పుడు విడుదల చేస్తున్నామని హోం మంత్రి అనిత తెలిపారు.
మొత్తం 6100 పోస్టులకు 5.3 లక్షల దరఖాస్తులు రాగా 4.59 లక్షల మంది హాజరయ్యారు.
ఫైనల్స్‌కి 33921 మంది అర్హత పొందారు.
సెలక్ట్ అయిన అభ్యర్థులకు సెప్టెంబర్ నుంచి ట్రైనింగ్ ప్రారంభిస్తాం
9 నెలల్లో పోస్టింగ్ ఇస్తాం
విశాఖకు చెందిన గండి నానాజీ మొదటి స్థానం
విజయనగరానికి చెందిన రమ్య మాధురి రెండో స్థానం
రాజమండ్రికి చెందిన అచ్యుత రావును మూడో స్థానం.
-
Aug 01, 2025 10:17 IST
ఫలితాలు విడుదల
ఏపీ పోలీస్ కానిస్టేబుల్ నియామక ఫలితాలు విడుదల
ఫలితాలు విడుదల చేసిన హోంమంత్రి అనిత, డీజీపీ
6,100 పోస్టులకు సంబంధించి ఆన్‌లైన్‌లో ఫలితాలు
-
Aug 01, 2025 10:14 IST
ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదు
వైసీపీ నేత ప్రసన్నకుమార్ రెడ్డిపై దర్గామిట్ట పీఎస్‌లో కేసు నమోదు
జగన్ పర్యటన సందర్భంగా నిబంధనలను అతిక్రమించి బైఠాయించడంపై కేసు నమోదు
బారికేడ్లు తోసేయడంతో పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు చేసిన పోలీసులు
-
Aug 01, 2025 08:58 IST
నేడు పోలీసుల కస్టడీకి డాక్టర్ నమ్రత
నేటి నుంచి ఐదు రోజుల పాటు నమ్రతను విచారించనున్న గోపాలపురం పోలీసులు.
చంచల్‌గూడ జైలు నుండి నమ్రతను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు.
నమ్రతపై హ్యూమన్ ట్రాఫికింగ్‌తో పాటు పలు కేసులు నమోదు
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో సరోగసి మాటున శిశు విక్రయాలు.
పిల్లలు లేని దంపతులే టార్గెట్‌గా భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన నమ్రత ముఠా
కస్టడీ విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం.
-
Aug 01, 2025 08:13 IST
నేటితో ముగిసిన నిందితుల రిమాండ్
మద్యం కుంభకోణం కేసులో నేటితో ముగిసిన నిందితుల రిమాండ్.
మద్యం కుంభకోణం కేసులో నేటితో ముగిసిన నిందితుల రిమాండ్.
రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మిథున్ రెడ్డి, గుంటూరు జిల్లా నుంచి బాలాజీ కుమార్, నవీన్.
విజయవాడ జిల్లా జైలులో ఉన్న 9 మందిని నేడు ఎసీబీ కోర్టులో హాజరు పరచనున్న సిట్ అధికారులు.
-
Aug 01, 2025 07:25 IST
పోలీస్ కానిస్టేబుల్ నియామక ఫలితాలు విడుదల
ఈ రోజు ఉదయం 9 గంటలకు పోలీస్ కానిస్టేబుల్ నియామక ఫలితాలు విడుదల
మంగళగిరి ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఫలితాలు విడుదల చేయనున్న హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.