Donald Trump: వాళ్లవి డెడ్ ఎకానమీలు.. భారత్, రష్యా అనుబంధంపై ట్రంప్ సంచలన కామెంట్స్..
ABN , Publish Date - Jul 31 , 2025 | 11:40 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్-రష్యా సంబంధాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియాపై 25 శాతం సుంకం విధించిన మరుసటి రోజే సోషల్ మీడియాలో సంచలన కామెంట్స్ చేశారు. ఆ రెండు దేశాలవి డెడ్ ఎకానమీస్ అంటూ..

Trump On Russia India Deal: భారతదేశ దిగుమతులపై 25 శాతం సుంకాన్ని ప్రకటించిన మరుసటి రోజే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటల దాడికి దిగాడు. న్యూఢిల్లీ, రష్యా మధ్య సన్నిహిత సంబంధాలు, వాణిజ్యబంధంపై తీవ్రంగా స్పందించారు. రెండు దేశాలు కలిసి పతనావస్థలో ఉన్న వారి ఆర్థిక వ్యవస్థలను మరింత కుప్పకూల్చుకున్నా.. తనకు పట్టింపు లేదని ట్రూత్ వేదికగా అసహనం వెళ్లగక్కారు. చెప్పినా వినకుండా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందని.. అందుకే జరిమానాగా సుంకాలు విధించామని చెప్పుకొచ్చాడు.
రష్యా, భారత్ ఏం చేసినా నాకు అనవసరం: ట్రంప్
'రష్యాతో భారత్ ఏం చేసినా నేను పట్టించుకోను. వారు పతనావస్థలో ఉన్న తమ ఆర్థిక వ్యవస్థలను మరింత దిగజార్చుతారు. మేము భారతదేశంతో చాలా తక్కువ వ్యాపారం చేశాము. చాలా ఎక్కువ సుంకాలే కారణం. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశం ఇండియానే. అదేవిధంగా, రష్యా, USA కలిసి దాదాపు ఎటువంటి వ్యాపారం చేయవు. దానిని అలాగే ఉంచుదాం' అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు.
అంతకుముందు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 25 శాతం సుంకాన్ని ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.' భారత్ మా స్నేహితుడే. కానీ మేం వారితో తక్కువ వ్యాపారం చేయడానికి కారణం అధిక సుంకాలు. అంతేగాక, వారు ఎల్లప్పుడూ రష్యా నుంచే సైనిక పరికరాలను కొనుగోలు చేస్తున్నారు. రష్యా అతిపెద్ద ఇంధన కొనుగోలుదారులు చైనా, రష్యాలు. అందరూ ఉక్రెయిన్‌లో రష్యా సృష్టిస్తున్న మారణహోమాన్ని ఆపాలని కోరుకుంటున్న సమయంలో భారత్ చేస్తున్నది సరిగ్గా లేదు. కాబట్టి భారతదేశం ఆగస్టు 1 నుంచి పైన 25% సుంకం జరిమానాగా విధిస్తున్నాం' అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
ప్రపంచానికి ట్రంప్ వార్నింగ్.. మాతో ఒప్పందాలు కుదుర్చుకోకపోతే..
భారత్‌పై 25 శాతం సుంకం విధింపు.. ట్రంప్ మరో కీలక ప్రకటన
మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి