Share News

Hero Vijay: టీవీకే నేత విజయ్‌ ధీమా.. రాష్ట్రంలో కొత్త చరిత్ర సృష్టించబోతున్నాం

ABN , Publish Date - Jul 31 , 2025 | 11:04 AM

రాష్ట్రంలో 1967, 1977 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల తరహాలోనే 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలుండబోతున్నాయని టీవీకే అధినేత విజయ్‌ జోస్యం చెప్పారు. యేళ్లతరబడి రాష్ట్రాన్ని పాలించిన పార్టీలకు ఆ రెండు ఎన్నికలు గుణపాఠం చెప్పాయని, అదేవిధంగా రాబోవు ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం ఘనవిజయం సాధించి కొత్త చరిత్ర సృష్టించనుందని ఆ పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్‌ ధీమా వ్యక్తం చేశారు.

Hero Vijay: టీవీకే నేత విజయ్‌ ధీమా.. రాష్ట్రంలో కొత్త చరిత్ర సృష్టించబోతున్నాం

- సభ్యత్వ నమోదుకు కొత్తగా యాప్‌ ఆవిష్కరణ

చెన్నై: రాష్ట్రంలో 1967, 1977 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల తరహాలోనే 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలుండబోతున్నాయని టీవీకే అధినేత విజయ్‌(Vijay) జోస్యం చెప్పారు. యేళ్లతరబడి రాష్ట్రాన్ని పాలించిన పార్టీలకు ఆ రెండు ఎన్నికలు గుణపాఠం చెప్పాయని, అదేవిధంగా రాబోవు ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం ఘనవిజయం సాధించి కొత్త చరిత్ర సృష్టించనుందని ఆ పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్‌ ధీమా వ్యక్తం చేశారు.


బుధవారం ఉదయం పనయూరులోని పార్టీ కార్యాలయంలో అట్టహాసంగా ఏర్పాటైన కార్యక్రమంలో సభ్యత్వ నమోదు కోసం ‘మై టీవీకే’ పేరుతో మొబైల్‌ యాప్‌ను ఆయన ఆవిష్కరించారు. అదే సమయంలో ఒకే కుటుంబంలో మూడు తరాలవారికి పార్టీ సభ్యత్వ కార్డులు అందజేసి, వారిని సత్కరించారు. వరుస విజయాలతో మదమెక్కిన రాజకీయ పార్టీలకు గతంలో జరిగిన రెండు ఎన్నికల్లో ఘోరపరాజయం ఎదురైందని, ఆ రీతిలోనే వచ్చే యేడాది జరిగే శాసనసభ ఎన్నికల్లో అధికారబలం కలిగిన పార్టీలు మట్టికరవటం ఖాయమని, టీవీకే ఘనవిజయం సా ధించి అధికారంలోకి వస్తుందన్నారు. టీవీకే విజయం సాధించాలంటే పార్టీ శ్రేణులు ఊరూరా తిరుగుతూ, ఇంటింటింకీ వెళ్ళి ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు.


nani4.2.jpg

అన్నాదురై వ్యాఖ్యలే ఆదర్శం...: టీవీకే ప్రముఖులు, జిల్లా నేతలు, పార్టీ శ్రేణులు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై గతంలో చేసిన వ్యాఖ్యలను స్ఫూర్తిగా తీసుకోవాలని విజయ్‌ అన్నారు. పార్టీ సభ్యత్వ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయని పార్టీ సభ్యుల సంఖ్యను రెండు కోట్లకు పైగా పెంచడమే తన ధ్యేయమని, ఆ మేరకే కొత్త మొబైల్‌యా్‌పను ఆవిష్కరించానని చెప్పారు. వచ్చే నెల మదురైలో మహానాడు, ఆ తర్వాత పర్యటన అంటూ తాను ఎన్నికల వరకూ ప్రజలవద్దకు వెళతానని చెప్పారు. అంతా మంచే జరుగుతుందనే భావన ప్రతి పార్టీ కార్యకర్తలోనూ స్థిరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌, ఆదవ్‌ అర్జునా, జిల్లా శాఖ నేతలు తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ లక్షదాటేసిన పసిడి ధరలు

ఉపాధి హామీ ఫీల్డ్‌అసిస్టెంట్లకు సమాన వేతనం

Read Latest Telangana News and National News

Updated Date - Jul 31 , 2025 | 11:04 AM