Share News

Trump VS Musk: ట్రంప్‌, మస్క్ వివాదం.. మధ్యలో రష్యా.. ట్విస్ట్ మామూలుగా లేదుగా..

ABN , Publish Date - Jun 07 , 2025 | 11:17 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఎలాన్‌ మస్క్‌ మధ్య వివాదం నెలకొన్న ప్రస్తుత తరుణంలో రష్యా ఎంటరవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమ దేశంలో రాజకీయ శరణార్థిగా ఉండేందుకు మస్క్‌కు అవకాశం కల్పిస్తామని బంపరాఫర్ ప్రకటించింది..

Trump VS Musk: ట్రంప్‌, మస్క్ వివాదం.. మధ్యలో రష్యా.. ట్విస్ట్ మామూలుగా లేదుగా..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ మధ్య రోజు రోజుకూ వివాదం ముదురుతోంది. బిగ్ బ్యూటిఫుల్ బిల్.. అనే భారీ బడ్జెట్ బిల్లుతో మొదలైన వివాదం చివరకు తెగదెంపులు చేసుకుని మస్క్ సొంతంగా కొత్త పార్టీ పెట్టే నిర్ణయం తీసుకునే వరకూ వచ్చింది. ఈ క్రమంలో రష్యా ఎంటరైంది. మస్క్‌కు అండగా తామున్నామని, క్రమంలోనే మస్క్‌కు రష్యా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. తమ దేశంలో రాజకీయ శరణార్థిగా ఉండేందుకు మస్క్‌కు అవకాశం కల్పిస్తామని బంపరాఫర్ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే..


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఎలాన్‌ మస్క్‌ (Donald Trump, Elon Musk) మధ్య వివాదం నెలకొన్న ప్రస్తుత తరుణంలో రష్యా (Russia) ఎంటరవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రష్యాకు చెందిన స్టేట్‌ డూమా ఫెడరేషన్‌ కమిటీ ఛైర్మన్‌ దిమిత్రి నోవికోవ్‌ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మస్క్ ఆలోచనా విధానం వేరుగా ఉంటుందని, ఆయన పూర్తిగా భిన్నమైన ఆట ఆడతారని, మస్క్‌కు రాజకీయ శరణార్థిగా ఉండాల్సిన అవసరం లేదని చెబుతూనే.. ఒకవేళ అలా ఉండాలనే ఉద్దేశం ఉంటే రష్యా సహకరిస్తుందని చెప్పారు.


అమెరికాకు చెందిన ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ లాగానే.. మస్క్‌కు రష్యాలో రాజకీయ శరణార్థిగా అవకాశం కల్పిస్తారా.. అంటూ ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు. అలాగే అమెరికాలో తర్వాత జరిగే ఎన్నికల్లో డెమోక్రట్లు రావాలని మస్క్‌ కోరుకోవడం లేదని తాను భావిస్తున్నట్లు చెప్పారు.


వైట్ హౌస్ మాజీ వ్యూహకర్త స్టీవ్ బానన్ మాట్లాడుతూ మస్క్ ను ఒక అక్రమ గ్రహాంతరవాసుడు అని, ఆయనను అమెరికా నుండి బహిష్కరించాలని ప్రకటించిన నేపథ్యంలో నోవికోవ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే స్టీవ్ బానన్ మాట్లాడుతూ టెక్ బిలియనీర్ కంపెనీ స్పేస్‌ఎక్స్‌ను స్వాధీనం చేసుకోవాలని కూడా అమెరికా ప్రభుత్వాన్ని కోరారు.


అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వ్యోమగాములను స్పేస్‌ఎక్స్ యొక్క డ్రాగన్ అంతరిక్ష నౌకలో తీసుకెళ్లడం, తీసుకురావడం చేస్తుంటారు. అయితే ఈ అంతరిక్ష నౌకను నిలిపేస్తామని మస్క్ బెదిరించిన తర్వాత.. స్టీవ్ బానన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది దేశానికి తీవ్రమైన ముప్పు కావచ్చని.. దీన్ని దృష్టిలో ఉంచుకుని ట్రంప్ వెంటనే స్పేస్‌ఎక్స్‌ను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని బానన్ వాదించారు.


ఇవీ చదవండి:

సెకెండ్ హ్యాండ్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇస్మార్ట్ ఆటో డ్రైవర్.. ఇతడు నెలకు రూ.8 లక్షలు ఎలా సంపాదిస్తున్నాడో తెలిస్తే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 07 , 2025 | 11:17 AM