Skipping Dinner Effects: రోజూ డిన్నర్ మానేస్తే.. ఈ సమస్యలు తప్పవు!
ABN , Publish Date - Jul 21 , 2025 | 07:57 AM
రాత్రుళ్లు తరచూ భోజనం చేయడం మానేస్తే ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో మీకు తెలుసా? ఖాళీ కడుపుతో నిద్రపోతే శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. డిన్నర్ స్కిప్ చేస్తే బరువు తగ్గకపోగా ఈ సమస్యలు వచ్చే ప్రమాదముందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. .

రోజూ నిద్రలేచాక తీసుకునే మొదటి భోజనం ఎంత ముఖ్యమో మీరు వినే ఉంటారు. అల్పాహారం స్కిప్ చేస్తే ఎన్ని సమస్యలు వస్తాయో.. డిన్నర్ చేయడం మానేసినా అంతకంటే ఎక్కువ సమస్యలు వచ్చే ప్రమాదముంది. రాత్రి భోజనం ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమైనదని అర్థం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బరువు తగ్గుతామనే ఆశతో, ఇతర కారణాలతో చాలామంది ఈ మధ్య రోజూ రాత్రుళ్లు భోజనం చేయడం మానేస్తున్నారు. ఈ అలవాటు ఎంత మాత్రం ఆరోగ్యానికి మేలు చేయదు. అల్పహారం ఉదయం శరీర జీవక్రియకు కిక్‌స్టార్ట్ ఇచ్చినట్టే రాత్రి భోజనం శరీరానికి అవసరమైన శక్తిని, పోషకాలను అందిస్తుంది.
రాత్రుళ్లు భోజనం చేయకుండా పడుకుంటే సరిగా నిద్రపట్టదు. ఒకవేళ వచ్చినా శరీర అలసట తీరదు. ప్రతి రోజూ నిరంతరాయంగా 12-14 గంటల పాటు ఉపవాసం ఉంటే అది లేనిపోని అనారోగ్యాలకు దారితీస్తుంది. రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులు ఏర్పడి అనేక రుగ్మతలకు కారణమవుతాయి. అప్పుడప్పుడు డిన్నర్ చేయడం మానేస్తే పెద్ద నష్టం జరగదు. కానీ, ప్రతి రోజూ రాత్రి భోజనం దాటవేయడం వల్ల ఆరోగ్యం గణనీయంగా దెబ్బతింటుంది. ఈ అలవాటు వల్ల ఈ కింది సమస్యలు వస్తాయి.
జీవక్రియకు అంతరాయం
క్రమం తప్పకుండా రాత్రి భోజనం మానేస్తే జీవక్రియ మందగించవచ్చు. భోజనాల మధ్య ఎక్కువ సమయం ఉందని మీ శరీరం గ్రహించినప్పుడు అది 'సేఫ్ మోడ్'లోకి మారవచ్చు. అంటే శక్తిని కాపాడుకోవడానికి తక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది. తద్వారా మీరు అలసిపోతారు. బరువు తగ్గడం కూడా కష్టతరం అవుతుంది.
రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులు
డిన్నర్ చేయకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను రాత్రిపూట చాలా తగ్గిపోతాయి. ఒకవేళ పగటిపూట ఎక్కువగా తినకపోతే తలతిరగడం, చిరాకు, అలసట, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. కాలక్రమేణా ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని ప్రభావితం చేసి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.
కండరాల పటుత్వం
మీరు బరువు తగ్గడానికి రాత్రి భోజనం మానేస్తుంటే కొవ్వు కంటే కండర ద్రవ్యరాశిని కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రత్యేకించి మీరు రోజంతటిలో తగినంత ప్రోటీన్ లేదా కేలరీలు పొందకపోతే.
రుగ్మతల ప్రమాదం
నిరంతరం రాత్రి భోజనం తినకపోతే అతిగా తినడం లేదా క్రమరహిత ఆహార విధానాలకు దారితీస్తుంది. ఇది మానసిక, భావోద్వేగాలను తీవ్ర ప్రభావితం చేసే నిర్బంధ ఆహారపు అలవాట్ల సంకేతం కూడా కావచ్చు.
పోషకాహార లోపాలు
ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు వంటి ముఖ్యమైన పోషకాలను పొందడానికి రాత్రి భోజనం మంచి సమయం. ప్రతిరోజూ దీన్ని దాటవేయడం వల్ల కాల్షియం, ఐరన్, మెగ్నీషియం లేదా బి-విటమిన్లు వంటి పోషకాల లోపాలు ఏర్పడతాయి. ఇవి శక్తి, రోగనిరోధక శక్తి, మొత్తం ఆరోగ్యానికి ముఖ్యమైనవి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
ఈ మ్యాజిక్ వాటర్‌తో పింపుల్స్‌కు శాశ్వత పరిష్కారం.. !
ఈ జంతువు మాంసం తింటే పేగులు కుళ్లిపోతాయ్..!
For More Health News