Triphala Water: ఈ మ్యాజిక్ వాటర్‌తో పింపుల్స్‌కు శాశ్వత పరిష్కారం.. !
ABN , Publish Date - Jul 21 , 2025 | 07:28 AM
త్రిఫల నీరు తాగడం వల్ల అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. ఆయుర్వేదం ప్రకారం, ప్రతి రోజూ రాత్రిపూట ఈ సమయంలో త్రిఫల నీరు తాగితే తప్పకుండా మొటిమలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

ఆయుర్వేదంలో త్రిఫల చూర్ణాన్ని అద్భుత ఔషధంగా పరిగణిస్తారు. ఉసిరి, కరక్కాయ, తానికాయ వంటి మూడుపండ్ల నుంచి తయారుచేసిన పొడిని త్రిదోష రసాయనం అని అంటారు. ఆయుర్వేదం ప్రకారం, ఈ పొడిని తింటే వాత, పిత్త, కఫం దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే, త్రిఫలను ఎన్నో సమస్యలకు పరిష్కారంగా ఉపయోగించవచ్చు. ప్రతిరోజూ త్రిఫల చూర్ణా్న్ని నీటిలో కలిపి తాగితే కడుపు శుభ్రమవుతుంది. శరీరంలోని విషపూరిత రసాయనాలను బయటకు వెడలగొట్టి డీటాక్స్ చేస్తుంది. అనేక వ్యాధులను నయం చేయడంలో సహాయపడటంతో పాటు చర్మ సౌందర్యానికి ఇదో అద్భుత సాధనం.
త్రిఫల నీటిని ఎలా తయారు చేయాలి
త్రిఫల నీటిని తయారు చేయడానికి రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో 5 నుండి 6 గ్రాముల త్రిఫల పొడిని నానబెట్టండి. ఈ నీటిని ఉదయం మరిగించి, వడకట్టి, గోరువెచ్చగా అయిన తర్వాత తాగాలి. ఈ నీరు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. రాత్రి పడుకునే అరగంట ముందు కూడా త్రిఫల నీటిని తాగవచ్చు. ఈ నీటిని పగలు లేదా రాత్రి ఖాళీ కడుపుతో తాగితే బోలెడన్ని ఆరోగ్య ప్రయోనాలు కలుగుతాయి.
మలబద్ధకం
త్రిఫల నీరు తాగడం వల్ల దీర్ఘకాలిక మలబద్ధకం కూడా నయమవుతుంది. ప్రతిరోజూ కడుపు శుభ్రపడుతుంది. అనేక జీర్ణ సంబంధిత సమస్యలు నయమవుతాయి. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో త్రిఫల నీరు తాగడం వల్ల కడుపు పరిశుభ్రంగా మారుతుంది.
బరువు
త్రిఫల నీరు శరీర జీవక్రియను పెంచడంలో కూడా సహాయపడుతుంది. దీని కారణంగా కొవ్వు వేగంగా కరుగుతుంది. బరువు తగ్గడం మరింత సులభం అవుతుంది.
మొటిమలు, జుట్టు
త్రిఫల నీరు ముఖం మీద మొటిమలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో ఉన్న విషాన్ని తొలగిస్తుంది. బాడీలోని టాక్సిన్లను బయటకు పంపిస్తుంది. అలాగే, చర్మంపై మొటిమలను తొలగించడంలో సహాయపడుతుంది. త్రిఫల నీటితో జుట్టును కడిగితే కుదుళ్లు బలంగా మారుతాయి. వెంట్రుకలు రాలడం ఆగిపోతుంది. త్రిఫల నీరు జుట్టును నల్లగా మార్చడంలో కూడా సహాయపడుతుంది.
త్రిఫల నీరు తాగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మీరు ప్రతిరోజూ త్రిఫల నీటిని తాగుతుంటే దాని పరిమాణాన్ని గుర్తుంచుకోవడం ముఖ్యం. దీని వల్ల విరేచనాలు, జీర్ణశయ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. పొడి చర్మం ఉన్నవారు త్రిఫలను కొబ్బరి నూనెతో కలిపి వాడుకోవాలి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
ప్రతిరోజూ లెమన్ జ్యూస్ తాగితే అసిడిటీ వస్తుందా?
ఈ జంతువు మాంసం తింటే పేగులు కుళ్లిపోతాయ్..!
For More Health News