Baby Grok AI: పిల్లల కోసం ప్రత్యేక ఏఐ చాట్ బాట్: ఎలాన్ మస్క్
ABN , Publish Date - Jul 21 , 2025 | 07:34 AM
పిల్లల కోసం విజ్ఞానదాయక కంటెంట్‌ను అందించే ప్రత్యేక చాట్‌బాట్‌ను తాము అభివృద్ధి చేస్తున్నట్టు ఎక్స్‌ఏఐ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ తాజాగా పేర్కొన్నారు. దీని పేరు బేబీ గ్రోక్ అని చెప్పుకొచ్చారు.

ఇంటర్నెట్ డెస్క్: పిల్లల కోసం ప్రత్యేకమైన ఏఐ చాట్ బాట్‌ను ఎక్స్‌ఏఐ సిద్ధం చేస్తోందిన సంస్థ అధినేత ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. బేబీ గ్రోక్‌గా పేరు పడ్డ ఈ యాప్ పిల్లలకు అనువైన, విజ్ఞానదాయక కంటెంట్‌ను అందిస్తుందని అన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చాట్‌బాట్‌ల కంటే బేబీ గ్రోక్ మరింత భద్రమైనదని ఆయన అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. అయితే, ఈ కొత్త టూల్ ఎలా పని చేస్తుందో మాత్రం వివరించలేదు.
ప్రస్తుతమున్న గ్రోక్ కంటే మరింత సరళతరంగా ఉండేలా బేబీ గ్రోక్‌ను డిజైన్ చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా పిల్లలకు తగిన కంటెంట్ ఇందులో అందుబాటులో ఉండేలా రూపొందిస్తున్నారట.
గ్రోక్‌ను 2023లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఓపెన్ ఏఐకి చెందిన చాట్‌జీపీటీ, గూగుల్‌కు చెందిన జెమినీ, మెటాకు చెందిన లామాకు ప్రత్యామ్నాయంగా దీన్ని డిజైన్ చేశారు. ప్రస్తుతం గ్రోక్‌లో డీప్ సెర్చ్, థింక్, బిగ్ మైండ్ అనే మూడు మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఎంతటి వివరమైన సమాధానం కావాలో అనే దాన్ని బట్టి యూజర్లు ఈ మూడింట్లో ఏదో ఒక మోడ్‌ను ఎంచుకుని గ్రోక్‌ను ప్రశ్నలు అడగొచ్చు.
లేటెస్ట్ వర్షన్ అయిన గ్రోక్-4 ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. పీహెచ్‌డీ స్థాయి ప్రశ్నలకు కూడా ఈ వర్షన్ సమాధానాలు చెప్పగలదని మస్క్ అప్పట్లో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇది కొత్త విషయాలను కనుగొన్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు. ఆ తరువాత గ్రోక్ యూదువ్యతిరేక కంటెంట్‌ను షేర్ చేయడం కాంట్రవర్సీకి దారి తీసింది.
ఇక బేబీ గ్రోక్ ప్రకటనను అనేక మంది స్వాగతించారు. చాట్‌జీపీటీకి బదులుగా దీన్నే తమ పిల్లలకు సూచిస్తామని కొందరు అన్నారు. పలువురు ఈ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ మస్క్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములు సముద్రంలోనే ఎందుకు దిగుతారో తెలుసా..?
పవర్ బ్యాంక్ కొనాలనుకునేవారు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి
Read Latest and Technology News