Srinivas Varma: జగన్ హయాంలో ఒక్క డీఎస్సీని నిర్వహించలేదు.. శ్రీనివాస్ వర్మ ఫైర్
ABN , Publish Date - Nov 29 , 2025 | 08:22 PM
గత ఐదేళ్లలో దేశంలో ఒక్క డీఎస్సీని నిర్వహించని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వమేనని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పెద్ద ఎత్తున పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు.
పశ్చిమగోదావరి, నవంబరు29 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)పై కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ (Union Minister Srinivas Varma) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క రిక్రూట్‌మెంట్ కూడా జరగలేదని విమర్శించారు.
ఇవాళ(శనివారం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భీమవరం ఎస్‌ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో మెగా జాబ్ మేళా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ వర్మ, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు శ్రీనివాస్ వర్మ.
గత ఐదేళ్లలో దేశంలో ఒక్క డీఎస్సీని నిర్వహించని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వమేనని ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పెద్ద ఎత్తున పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. అనకాపల్లిలో నిర్మించబోయే ఆర్ఎస్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ద్వారా 90 వేల మంది నిరుద్యోగులకు త్వరలో ఉద్యోగాలు రానున్నాయని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం
రేపు ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. జాగ్రత్త సుమీ!
Read Latest AP News And Telugu News