Share News

Jitender Singh ON E Governance: ఏపీ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ ప్రశంసలు

ABN , Publish Date - Sep 22 , 2025 | 08:31 PM

సాంకేతిక విధానాన్ని పరిపాలన పద్ధతుల్లో వినియోగించడంతో అవినీతికి ఆస్కారం ఉండదని కేంద్ర సహాయ మంత్రి జితేందర్ సింగ్ పేర్కొన్నారు. త్వరలో భోగాపురం అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ పూర్తవుతుందని జితేందర్ సింగ్ తెలిపారు.

Jitender Singh ON E Governance: ఏపీ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ ప్రశంసలు
Jitender Singh ON E Governance

విశాఖపట్నం, సెప్టెంబర్ 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేంద్ర సహాయ మంత్రి జితేందర్ సింగ్ (Jitender Singh) ప్రశంసలు కురిపించారు. ప్రజలకు మెరుగైన సేవలను కూటమి ప్రభుత్వం అందిస్తోందని వ్యాఖ్యానించారు. పరిపాలనలో సాంకేతిక జోడించడంతో ప్రజలకు పలు సేవలు త్వరితగతిన అందుతాయని చెప్పుకొచ్చారు. సాంకేతిక విధానాన్ని పరిపాలన పద్ధతుల్లో వినియోగించడంతో అవినీతికి ఆస్కారం ఉండదని పేర్కొన్నారు. 28వ ఈ-గవర్నెన్స్ జాతీయ సదస్సు (National Conference on E Governance) అవార్డ్స్ సెషన్‌లో ముఖ్యఅతిథిగా జితేందర్ సింగ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్, రాష్ట్ర, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా జితేందర్ సింగ్ ప్రసంగించారు. జాతీయస్థాయిలో ఈ-గవర్నెన్స్‌లో భారత వాతావరణ శాఖ, జాతీయ రహదారుల శాఖ, సిక్కిం పరిపాలన విభాగాలు ప్రతిభ చూపాయని తెలిపారు. అలాగే, గుజరాత్ ప్రభుత్వం, కేరళ రూరల్ వాటర్ విభాగాలతోపాటు పలు ప్రభుత్వ సంస్థలకు అవార్డులను అందజేశానని వివరించారు. త్వరలో భోగాపురం అంతర్జాతీయ ఎయిర్ పోర్టు (Bhogapuram Airport) పూర్తవుతుందని చెప్పుకొచ్చారు జితేందర్ సింగ్.


జీఎస్టీ తగ్గింపుతో దేశ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. నూతన జీఎస్టీ సవరణలతో పాలన సౌలభ్యంతో పాటు పారదర్శకమైన సర్వీసులను అందించడానికి వీలుంటుందని కేంద్ర సహాయ మంత్రి జితేందర్ సింగ్ ఉద్ఘాటించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సాంకేతిక పరిజ్ఞానంతో కాలుష్య నియంత్రణను పటిష్టం చేయాలి: పవన్ కల్యాణ్

జీఎస్టీ సంస్కరణలతో మేడిన్ ఇండియా మరింత బలోపేతం: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 22 , 2025 | 09:08 PM