Anagani Satya Prasad: విశాఖ వేదికగా యోగాంధ్ర వరల్డ్ రికార్డ్: మంత్రి అనగాని
ABN , Publish Date - Jun 21 , 2025 | 07:29 PM
యోగాంధ్రను విజయవంతం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎనలేని కృషి చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఒక్క విశాఖలోనే కాక ఏపీవ్యాప్తంగా దాదాపు రెండు కోట్ల మందికి పైగా ప్రజలు యోగాసానాల్లో పాల్గొని చరిత్ర సృష్టించారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.

విశాఖపట్నం: విశాఖ వేదికగా ఇవాళ(శనివారం) నిర్వహించిన యోగాంధ్ర అరుదైన రికార్డ్‌ని సొంతం చేసుకుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్, స్టాంప్స్ మంత్రి అనగాని సత్యప్రసాద్ (AP Minister Anagani Satya Prasad) తెలిపారు. యోగాంధ్రను విజయవంతం చేసిన ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఏపీ వైపు తిరిగి చూసిందని అన్నారు. యోగాంధ్రను విజయవంతం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎనలేని కృషి చేశారని చెప్పారు. ఒక్క విశాఖలోనే కాక ఏపీవ్యాప్తంగా దాదాపు రెండు కోట్ల మందికి పైగా ప్రజలు యోగాసానాల్లో పాల్గొని చరిత్ర సృష్టించారని అన్నారు. ప్రజలు, కూటమి నేతలు, అధికారులు సమన్వయంతో యోగాంధ్రని విజయవంతం చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.
ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలనేది సీఎం చంద్రబాబు ఆశయం: ఎంవీ ప్రణవ్ గోపాల్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుతో శనివారం తెల్లవారుజామునే యోగాలో పాల్గొనేందుకు ప్రజలు తరలివచ్చారని VMRDA చైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్ తెలిపారు. ముఖ్యమంత్రి మాటలకు ఉత్తరాంధ్ర ప్రజలు ఇచ్చే గౌరవం ఇదని అన్నారు. విశాఖపట్నం వేదికగా యోగా దినోత్సవం గిన్నిస్ రికార్డ్ సాధించటం దేశానికి గర్వకారణమని ఉద్ఘాటించారు. ప్రజలు, యోగా సాధకులు స్వచ్చందంగా యోగాంధ్రలో పాల్గొన్నారని తెలిపారు ఎంవీ ప్రణవ్ గోపాల్.
ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయమని ఎంవీ ప్రణవ్ గోపాల్ అన్నారు. అందుకు ప్రజలు తమవంతు సహకారం యోగాలో పాల్గొని అందించారని చెప్పారు. యోగాంధ్రతో ప్రపంచం అంతా విశాఖపట్నం వైపు చూసిందని వెల్లడించారు. యోగాంధ్రతో విశాఖపట్నం ఖ్యాతి మరోసారి ప్రపంచానికి తెలిసిందని తెలిపారు. ఈ సందర్భంగా యోగాంధ్రని విజయవంతం చేసిన ప్రజలకు, కూటమి నేతలకు, అధికారులకు ఎంవీ ప్రణవ్ గోపాల్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
విజయవాడ ఆస్పత్రికి చెవిరెడ్డి.. ఏమైందంటే
సరికొత్త చరిత్ర.. యోగా డేపై సీఎం చంద్రబాబు
యోగా గ్రాండ్ సక్సెస్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష
Read latest AP News And Telugu News