Minister Atchannaidu: ఫిష్ ఆంధ్రా పేరిట పైసలు దోచేశారు.. జగన్ అండ్ కోపై మంత్రి అచ్చెన్న ఫైర్
ABN , Publish Date - Nov 21 , 2025 | 07:40 PM
గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులకు చేసిందేమీ లేదని ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి మత్స్యకారులకు వలలు, బోట్లకి సబ్సిడీ ఇస్తోందని పేర్కొన్నారు.
శ్రీకాకుళం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ( YSRCP) ప్రభుత్వం మత్స్యకారులను మోసం చేసిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (AP Minister Atchannaidu) ఆరోపణలు చేశారు. ఫిష్ ఆంధ్రా అని పేరు పెట్టి గత జగన్ ప్రభుత్వం మొత్తం డబ్బులను దోచుకుందని విమర్శలు చేశారు. గత ప్రభుత్వం మత్స్యకారులకు కనీసం డీజిల్ సబ్సిడీ కూడా ఇవ్వలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ(శుక్రవారం) శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్న పర్యటించారు. ఈ నేపథ్యంలో మత్స్యకార దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత్స్యకారులందకీ కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు తరఫున శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.
ఏపీలో సుదీర్ఘమైన 1,100 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందని.. అందులో శ్రీకాకుళం జిల్లాకు 193 కిలోమీటర్ల తీరం ఉందని వివరించారు. టీడీపీ ఆవిర్భవించి 42 సంవత్సరాలు అయిందని గుర్తుచేశారు. నాటి నుంచి నేటి వరకు టీడీపీ మత్స్యకారులకు అండగా ఉందని తెలిపారు. ఏపీలో మత్స్యకారులకు పెద్దపీట వేసింది టీడీపీ ప్రభుత్వమేనని చెప్పుకొచ్చారు. 50 సంవత్సరాలకే వారికి పింఛన్ ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమని గుర్తుచేశారు. ఏ తుఫాన్ వచ్చినా మత్స్యకారులకు 50 కేజీల ఉచిత బియ్యం ఇస్తున్నామని వివరించారు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.
గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులకు చేసిందేమీ లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి మత్స్యకారులకు వలలు, బోట్లకి సబ్సిడీ ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. సీ కోస్ట్ అంతా సోలార్ విద్యుత్ స్తంభాలు వేయించామని అన్నారు. మూలపేటలో పోర్టు తయారవుతుందని.. బుడగట్లపాలెంలో జట్టీ ఏర్పాటు చేస్తామని వివరించారు. మంచినీళ్లపేటలో ఫిష్ ల్యాండ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టామని.. మత్స్యకారులంతా తమ కుటుంబసభ్యులుగా భావిస్తున్నామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రజలకు ఇబ్బందులు లేకుండా భూముల రీ సర్వే చేయండి: రఘురామ
విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
Read Latest AP News And Telugu News