AP News: ప్రసన్న కుమార్ రెడ్డిపై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు
ABN , Publish Date - Jul 08 , 2025 | 03:37 PM
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డిపై ప్రశాంతి రెడ్డి నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు.

నెల్లూరు: కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై (MLA Prashanthi Reddy) మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి (Prasanna Kumar Reddy) అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డిపై ప్రశాంతి రెడ్డి నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఇవాళ(మంగళవారం) ఫిర్యాదు చేశారు. ప్రసన్నకుమార్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఈ ఫిర్యాదులో ప్రశాంతిరెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రసన్న కుమార్ రెడ్డి తనపై వ్యక్తిగతంగా అసభ్యకర పదజాలంతో ధూషణలు చేశారని ఫైర్ అయ్యారు. తాను ఏఎస్పీకి ప్రసన్న కుమార్ రెడ్డిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానని.. పోలీసులు చట్టపరంగా ఆయనపై చర్యలు తీసుకుని అరెస్టు చేయాలని కోరారు ప్రశాంతి రెడ్డి.
జగన్ పార్టీ నీచసంస్కృతికి తెరదీసింది...
జగన్ పార్టీ నీచసంస్కృతికి తెరదీసిందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మండిపడ్డారు. తనపై ప్రసన్న కుమార్ రెడ్డి దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశారని ఫైర్ అయ్యారు. మహిళలందరినీ వైసీపీ నేతలు దారుణంగా కించపరుస్తున్నారని ధ్వజమెత్తారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక వైసీపీ నేతలు తప్పుడు మార్గాన్ని ఎన్నుకున్నారని విమర్శించారు. భర్త చనిపోయిన తాను, అత్తవారింట్లో అందరి అనుమతితో ఎంపీ వేమిరెడ్డిని వివాహం చేసుకున్నానని తెలిపారు. ఎన్నికల సమయం నుంచి తన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రసన్న కుమార్ రెడ్డి, వైసీపీ నేతలు నీచపు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్త చేశారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి.
అప్పటి నుంచి కోవూరు మహిళాలోకం తన వెంట అండగా నిలిచిందని ఉద్ఘాటించారు. చెల్లెలు వరుసయ్యే తనపై ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డికి, వైసీపీ నేతలకి చెల్లెళ్లని గౌరవించే సంస్కారం లేదని దుయ్యబట్టారు. మహిళలని కించపరుస్తూ, వారి మానసిక స్థైరాన్ని దెబ్బతీసేందుకు జగన్ పార్టీ కుట్రలు చేస్తోందని ఫైర్ అయ్యారు. మహిళలపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తే, జగన్ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. టీడీపీ పార్టీ మహిళలకి అన్నిరంగాల్లో 33శాతం రిజర్వేషన్లు ఇస్తోందని స్పష్టం చేశారు. మహిళలు ఎదగకూడదనే పగతోనే వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి నారా లోకేశ్ నెల్లూరు పర్యటన సక్సెస్ కావడంతో వైసీపీ నేతలు తట్టుకోలేకపోయారని... ఆ వెంటనే ప్రసన్న కుమార్ రెడ్డి తనపై దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
శ్రీవారి భక్తులకు పుస్తక ప్రసాదం
Read latest AP News And Telugu News