Kirak RP: వేమిరెడ్డి ఫ్యామిలీపై కుట్ర పన్నారు.. కిరాక్ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Jul 09 , 2025 | 12:07 PM
వైసీపీ అధినేత జగన్ మెప్పు, బిస్కెట్ల కోసం ఆ పార్టీ నేతలు అనిల్ కుమార్ ప్రసన్నకుమార్ రెడ్డి నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని సినీ నటుడు కిరాక్ ఆర్పీ ధ్వజమెత్తారు. ఆడవాళ్ల జోలికొచ్చినా, కించపరిచినా బాగుపడే ప్రసక్తేలేదని హెచ్చరించారు. ప్రసన్న, అనిల్ కుమార్ పతనం ప్రారంభమైందని కిరాక్ ఆర్పీ విమర్శించారు.

నెల్లూరు: వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులకి ప్రజల్లో వస్తున్న మంచిపేరుని చూసి ఓర్వలేకనే వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నీచపు వ్యాఖ్యలు చేశారని సినీనటుడు కిరాక్ ఆర్పీ (Kirak RP) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం వేమిరెడ్డి దంపతులు రూ.వందల కోట్ల సొంత డబ్బు ఖర్చు చేస్తున్నారని కొనియాడారు. ఇవాళ(బుధవారం) నెల్లూరు జిల్లాలో మీడియాతో కిరాక్ ఆర్పీ మాట్లాడారు. భార్యాభర్తలంటే వేమిరెడ్డి దంపతులు, అన్నదమ్ములంటే కోటంరెడ్డి సోదరులు ఆదర్శంగా నిలుస్తారని ఉద్ఘాటించారు. రాజకీయాల్లో అత్యున్నత స్థానంలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై వైసీపీ నేతలు కుట్ర పన్నారని ఆరోపించారు కిరాక్ ఆర్పీ.
దృశ్యం సినిమా తరహాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఏదో ఒకటి చేసి, నేరం ఇతరులపై మోపే ప్రయత్నం జరుగుతోందని కిరాక్ ఆర్పీ ఆరోపించారు. ప్రసన్న అనుచరుడు చలపతి ఎన్ని నేరాలకి పాల్పడ్డారో, ఎన్ని వందల ఎకరాలు కబ్జా చేశారో అందరికీ తెలుసునని విమర్శించారు. పొట్డీశ్రీరాములు, పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహానీయులు పుట్టిన గడ్డ మీదే వైసీపీ నేతలు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ పుట్టారని చెప్పుకొచ్చారు కిరాక్ ఆర్పీ.
జగన్ మెప్పు, బిస్కెట్ల కోసం వైసీపీ నేతలు నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని కిరాక్ ఆర్పీ ధ్వజమెత్తారు. ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడిన వీడియోని నీ ఇంట్లోని మహిళలు, పిల్లలకి చూపించాలని... మీ ఇళ్లలో ఉండేది ఆడవాళ్లా కదా అని అనిల్ కుమార్‌ని ప్రశ్నించారు. ఒక మహిళ చేతిలో 57వేల ఓట్ల తేడాతో ప్రసన్నకుమార్ రెడ్డి ఓడిపోయారని ఎద్దేవా చేశారు. ఆడవాళ్ల జోలికొచ్చినా, కించపరిచినా బాగుపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రసన్న, అనిల్ కుమార్ పతనం ప్రారంభమైందని విమర్శించారు. ప్రసన్న వ్యాఖ్యలన్నీ జగన్ నుంచి వచ్చిన స్క్రిప్టేనని ఆరోపించారు. వైసీపీని ఎన్నికల్లో ప్రజలు ఎందుకు ఓడించారో.. ఇప్పటికీ సమీక్షించుకోలేదని చెప్పుకొచ్చారు. ప్రసన్నని అనిల్ కుమార్ వెనుకేసుకొస్తున్నారని... అనిల్ కుమార్ కూడా ఆ వ్యాఖ్యలు చేసినట్లేనని మండిపడ్డారు. జగన్ తన తల్లిని వీధుల్లోకి నెట్టెశారని... చెల్లెలు పసుపు చీర కట్టుకుంటే నీచమైన వ్యాఖ్యలు చేశారని ఫైర్ అయ్యారు. అదే తరహాలో ఆడవాళ్లు అందరినీ జగన్ తిట్టిస్తున్నారని కిరాక్ ఆర్పీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
జగన్ జీవితమంతా ఇక ఓదార్పు యాత్రలే
స్లీపర్ సెల్స్‌పై సింగిల్ జడ్జి ఉత్తర్వులు నిలిపివేత
For More AP News and Telugu News